Page Loader
Apple iOS 26 Beta: ఆపిల్ iOS 26 బీటా 2 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు,ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..! 
ఆపిల్ iOS 26 బీటా 2 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు,ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..!

Apple iOS 26 Beta: ఆపిల్ iOS 26 బీటా 2 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు,ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ యూజర్ల కోసం శుభవార్త. ఆపిల్ సంస్థ iOS 26 రెండవ డెవలపర్ బీటాను అధికారికంగా విడుదల చేసింది. ఇటీవల జరిగిన WWDC 2025 ఈవెంట్ సందర్భంగా ఆపరేటింగ్ సిస్టమ్‌కు భారీగా అప్‌గ్రేడ్స్‌ను తీసుకొచ్చారు. ఇందులో యూజర్ ఇంటర్‌ఫేస్(UI)లో మార్పులు,యాక్సెసిబిలిటీ ఫీచర్లలో మెరుగుదలతో పాటు, సఫారి,వ్యాలెట్,యాప్ స్టోర్ లాంటి పాపులర్ యాప్‌లకు మరింత వినియోగదారునికి అనుకూలంగా మార్పులు చేశారు. అయితే, iOS 26 పబ్లిక్ బీటా ఎప్పుడు విడుదలవుతుందన్న విషయాన్ని ఆపిల్ సంస్థ ఇంకా వెల్లడించలేదు. మీరు డెవలపర్ బీటాను ఇన్స్టాల్ చేసేందుకు సిద్ధమవుతుంటే,ముందుగా మీ డివైస్‌లో ఉన్న మొత్తం డేటాను బ్యాకప్ చేసుకోవడం తప్పనిసరి. ఇకపై ఫీచర్లు ఏవి ఉన్నాయి? అప్‌డేట్ ఎలా పొందాలి? అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

వివరాలు 

iOS 26 బీటా 2 ఫీచర్లు - ముఖ్యాంశాలు: 

లిక్విడ్ గ్లాస్ డిజైన్ & కొత్త బ్యాక్‌గ్రౌండ్‌లు: ఈ బీటా వెర్షన్‌లో "లిక్విడ్ గ్లాస్" అనే ప్రత్యేకమైన డిజైన్‌ను ప్రవేశపెట్టారు. కంట్రోల్ సెంటర్ రీడిజైన్ కూడా ఆకర్షణీయంగా మారింది. యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్‌లో "Reduce Transparency" టోగుల్: ఇది యూజర్ ఇంటర్‌ఫేస్ పారదర్శకతను తగ్గించి, చదవడానికి సౌలభ్యంగా ఉంటుంది. సఫారీలో కొత్త ట్యాబ్ బటన్: సఫారీ బ్రౌజర్‌లో, బాటమ్-లెఫ్ట్ కార్నర్‌లో కొత్త ట్యాబ్ బటన్‌ను చేర్చారు. ఇది గత వెర్షన్‌లను పోలి ఉంటుంది. అలాగే, కాంపాక్ట్ ట్యాబ్ బార్ ద్వారా ఫార్వర్డ్ మరియు బ్యాక్‌వర్డ్ నావిగేషన్‌ను చూపుతుంది. యాప్ స్టోర్‌లో "Accessibility" విభాగం: డెవలపర్లు తమ యాప్ ప్రొడక్ట్ పేజీలలో ఫీచర్లను స్పష్టంగా హైలైట్ చేయగలిగేలా ప్రత్యేక సెక్షన్‌ను అందించారు.

వివరాలు 

iOS 26 బీటా 2 ఫీచర్లు - ముఖ్యాంశాలు: 

వ్యాలెట్ యాప్‌లో కొత్త ఆర్డర్ ట్రాకింగ్ ఫీచర్: ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఆర్డర్లను ట్రాక్ చేయగలుగుతారు. Siri స్కాన్ సామర్థ్యం: Siri ఇప్పుడు ఇమెయిల్స్‌ను స్కాన్ చేయగలదు. అలాగే, Apple Pay ద్వారా వచ్చిన రసీదులను స్కాన్ చేసి, ఆర్డర్లను ఒకే లిస్టుగా చూపిస్తుంది. ఆపిల్ మ్యూజిక్ లైవ్ రేడియో విడ్జెట్: ఇది లో-పవర్ మోడ్‌లో లైవ్ క్యాప్షన్‌లతో పనిచేస్తుంది. "Save Call Transcripts" ఫీచర్ ద్వారా కాల్ ట్రాన్స్క్రిప్షన్‌ను సేవ్ చేయవచ్చు. అయితే, ఇది వాడుతున్నవారికి ప్రత్యేకంగా ఒక వార్నింగ్ టోన్ వినిపిస్తుంది. లాక్ స్క్రీన్ విడ్జెట్‌లు & పాస్‌కీ సైన్-ఇన్ ఇంటర్‌ఫేస్: స్క్రీన్ దిగువన లాక్ స్క్రీన్ విడ్జెట్‌లతో పాటు పాస్‌కీ లాగిన్ ఇన్‌టర్‌ఫేస్‌లోనూ మార్పులు చేశారు.

వివరాలు 

iOS 26 బీటా 2 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? 

ప్రస్తుతం ఇది రిజిస్టర్డ్ డెవలపర్లుకి మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఆపిల్ డెవలపర్ ప్రోగ్రామ్ సభ్యుడైతే, మీ ఐఫోన్‌లో ఈ అప్‌డేట్‌ను పొందేందుకు క్రింది స్టెప్స్‌ను అనుసరించండి: Settings > General > Software Update > Beta Updates > అక్కడ iOS 26 డెవలపర్ బీటా అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఈ అప్‌డేట్ ఐఫోన్ 17 సిరీస్తో పాటు సెప్టెంబర్‌లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ జూలై నెలలోనే పబ్లిక్ బీటా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది.