LOADING...
Apple: యాపిల్ iPadOS 26 అధికారికంగా విడుదల.. డెస్క్‌టాప్ అనుభూతి, కొత్త డిజైన్, అపారమైన ఫీచర్లు 
యాపిల్ iPadOS 26 అధికారికంగా విడుదల.. డెస్క్‌టాప్ అనుభూతి, కొత్త డిజైన్, అపారమైన ఫీచర్లు

Apple: యాపిల్ iPadOS 26 అధికారికంగా విడుదల.. డెస్క్‌టాప్ అనుభూతి, కొత్త డిజైన్, అపారమైన ఫీచర్లు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
12:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ తన తాజా ఐప్యాడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ 'iPadOS 26'ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ సరికొత్త వెర్షన్‌లో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 'లిక్విడ్ గ్లాస్' డిజైన్, కొత్త విండో సిస్టమ్, Apple Intelligence ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లిక్విడ్ గ్లాస్ డిజైన్ - కొత్త లుక్‌తో ఐప్యాడ్ iPadOS 26లో కనిపించే తొలి పెద్ద మార్పు ఇదే. 'Liquid Glass' అనే డిజైన్ భాషను ఆపిల్ ప్రవేశపెట్టింది. ఇది అప్లికేషన్లు, డాక్, మెనుబార్‌లను పారదర్శకంగా చూపించే విధంగా ఉంటుంది. దీని వల్ల యూజర్‌కు మరింత ఇంటరాక్టివ్, దృశ్యపరంగా ఆకర్షణీయమైన అనుభూతి లభిస్తుంది.

Details

విండో మ్యానేజ్‌మెంట్‌లో విప్లవం

ఈ సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌లో 'కొత్త విండోయింగ్ సిస్టమ్'ను తీసుకొచ్చారు. దీని సాయంతో యూజర్లు ఒకేసారి అనేక యాప్స్‌ను తెరిచి, వాటిని మన ఇంటెన్షన్ ప్రకారం రీసైజ్, రిఅరేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక డెస్క్‌టాప్ తరహా అనుభూతిని కలిగిస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ - తెలివైన టాబ్లెట్‌ ఈ అప్‌డేట్‌లో 'Apple Intelligence'ను సమగ్రంగా పొందుపరిచారు. ఇందులో భాగంగా Live Translation వంటి స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి. ఇది భిన్న భాషల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేస్తుంది.

Details

కీలకమైన యాప్స్‌కు పెద్ద అప్‌డేట్స్‌

Files App : బహుళ కస్టమైజేషన్, ఆర్గనైజేషన్ ఆప్షన్లతో మరింత శక్తివంతంగా మారింది. Audio Features : వాయిస్ ఇన్‌పుట్‌ను మరింత వాడకసౌలభ్యం కలిగేలా తీర్చిదిద్దారు. Preview App : ఇది ఇప్పుడు ఐప్యాడ్‌కి కూడా వచ్చింది. PDFలు, ఇమేజ్‌లను Apple Pencil ద్వారా ఎడిట్ చేయొచ్చు. విడుదల తేదీ & అనుకూలమైన డివైసులు డెవలపర్ల కోసం iPadOS 26 ఆల్రెడీ లభిస్తోంది. పబ్లిక్ బీటా వర్షన్ను వేసవిలో విడుదల చేయనున్నారు. iPad Pro (M4) iPad Pro 12.9-inch (3rd gen & later) iPad Pro 11-inch (1st gen & later) మొదలైనవి. iPadOS 26తో యాపిల్ ఐప్యాడ్‌ను మరింత ప్రొఫెషనల్, ఇంటెలిజెంట్, ఫ్లెక్సిబుల్ డివైస్‌గా మలిచే దిశగా అడుగులు వేసింది.