
iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కు ముందే పూర్తి ఫీచర్స్, ధర లీక్..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ తన అత్యంత ప్రసిద్ధ "ఆ డ్రాపింగ్" ఈవెంట్‌ను మంగళవారం,సెప్టెంబర్ 9న జరుపనున్నట్లు ప్రకటించింది. ఈ వేడుకలో అత్యధికంగా ఆసక్తి కలిగిస్తున్న ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు కొత్త ఆపిల్ వాచ్, అప్‌డేట్ అయిన ఎయిర్‌పాడ్స్,మరికొన్ని యాక్సెసరీస్‌ను కూడా పరిచయం చేయవచ్చని అంచనా. విశేషంగా ఈసారి ఐఫోన్ 17 సిరీస్‌లో మొత్తం నాలుగు వేరియంట్లు వుండే అవకాశముంది. అవి: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్ మరియు బేసిక్ ఐఫోన్ 17 మోడల్.
వివరాలు
ఐఫోన్ 17 - డిజైన్,ఫీచర్లు:
గత నెలలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ ఈవెంట్ గురించి ఒక ప్రత్యేక లోగో ద్వారా సంకేతం ఇచ్చారు, అది థర్మల్ కెమెరా శైలిలో రూపొందించబడింది. దీన్ని చూసి ఆపిల్ అభిమానులు కొత్త ఫోన్లో థర్మల్ కెమెరా లేదా వేపర్-ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. అయితే, యాపిల్ ఇంకా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి అధికారికంగా వివరాలు వెల్లడించలేదు, కానీ లీక్ అయిన సమాచారం కొన్ని ఫీచర్లను సూచిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఐఫోన్ ఐదు సంవత్సరాల తర్వాత తన డిజైన్‌లో మార్పులు తీసుకురాబోతోంది. కొత్తగా రాబోతున్న ఐఫోన్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్ ఎయిర్ డిజైన్‌లను అనుసరించి ప్రత్యేక శైలిలో రూపుదిద్దే అవకాశం ఉంది.
వివరాలు
సన్నటి డిజైన్:
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఈ ఐఫోన్ 5.5 మిల్లీమీటర్ల మందంతో, ఇటీవల వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ కంటే సన్నగా ఉంటుంది. ప్రాసెసర్, డిస్‌ప్లే: ఐఫోన్ 17లో A19 ప్రాసెసర్, స్టాండర్డ్ USB-C పోర్ట్, ప్రోమోషన్ సపోర్ట్, 6.6-ఇంచ్ స్క్రీన్ ఉంటుందని లీక్ వివరాలు చూపిస్తున్నాయి. కెమెరా: ఐఫోన్ 17 ప్రో మోడల్‌లో అధునాతన కెమెరా ఫీచర్లు ఉంటాయి. ముఖ్యంగా తక్కువ లైట్‌లో మెరుగైన ఫోటోగ్రఫీ, జూమ్ ఫంక్షన్, క్వాలిటీ ఫోటోలు తీసుకోవడానికి అనువుగా ఉంటాయి.
వివరాలు
ఐఫోన్ 17 - కలర్ ఆప్షన్స్,బ్యాటరీ:
లీక్‌డ్ సమాచారం ప్రకారం, కొత్త ఐఫోన్ పచ్చ, ఊదా రంగులు వంటి కొత్త కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండవచ్చు. గత సంవత్సరం ఐఫోన్ 16 ఐదు రంగుల్లో (నలుపు, తెలుపు, గులాబీ, టీల్, అల్ట్రామరైన్ బ్లూ) విడుదల అయింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 5,000 mAh వరకు బ్యాటరీ సామర్థ్యం ఉండే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు పెద్ద బ్యాటరీ ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లోని 4,676 mAh కంటే ఎక్కువ. కొత్త ప్రో మోడల్‌లో అధునాతన OLED ప్యానెల్స్ ఉండబోతున్నాయి,ఇవి ఎక్కువ బ్రైట్‌నెస్ ఇవ్వగలవు కానీ బ్యాటరీపై ఎక్కువ ప్రభావం చూపవు. ఇది 4K వీడియోలు రికార్డు చేసే క్రియేటర్స్‌కు చాలా ఉపయోగపడుతుంది.
వివరాలు
ధర అంచనాలు:
వివిధ నివేదికల ప్రకారం,ఐఫోన్ 17 బేసిక్ మోడల్ ధర సుమారు రూ. 89,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ఎయిర్ ధర రూ. 95,000 వరకు, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ.1,64,900 వరకు ఉండవచ్చని అంచనా. కరెన్సీ మార్పులు,యాపిల్ వ్యూహాల ఆధారంగా ధరలు తుది లాంచ్ సమయంలో భిన్నంగా ఉండవచ్చు. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం,బేసిక్ ఐఫోన్ 17 ధర ఐఫోన్ 16 మాదిరిగానే సుమారు రూ. 79,900-80,000 మధ్య ఉండవచ్చని,కొత్తగా వచ్చిన ఐఫోన్ 17 ఎయిర్ ధర 899-949 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే ఈసమాచారం మొత్తం రూమర్స్,లీక్స్ మాత్రమే. ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించిన అన్ని అధికారిక వివరాలు లాంచ్ నాటికి అందుబాటులోకి వస్తాయి.