Apple: ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ ఆవిష్కరణ.. ఫోల్డబుల్ మోడల్ ప్రత్యేక ఆకర్షణ
ఈ వార్తాకథనం ఏంటి
అందరూ ఊహించినట్టుగానే ఆపిల్ తన కొత్త ఐఫోన్ 18 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో సంస్థ తొలిసారిగా తీసుకొచ్చిన ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో నిర్వహించిన 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' కార్యక్రమంలో సంస్థ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ నూతన ఉత్పత్తులను పరిచయం చేశారు.
వివరాలు
ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో
ఐఫోన్ డ్యూయో రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది.
స్టార్ వైట్, నైట్ స్కై రంగులను ఆపిల్ ఈ మోడల్ కోసం ఎంపిక చేసింది. ఫోన్‌ను పూర్తిగా విప్పినప్పుడు అత్యంత పలుచటి ఐఫోన్‌గా మారుతుంది.
ఫోల్డబుల్ డిజైన్‌కు అనుగుణంగా ఐఓఎస్ 27ను కూడా ఆపిల్ కొత్తగా రీడిజైన్ చేసింది.
ఫోన్‌ను విప్పినప్పుడు 7.6 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే అందుబాటులో ఉంటుంది.
ఇందులో రెండు హోమ్ స్క్రీన్ పేజీలతో పాటు మెయిల్, మెసేజెస్ వంటి కంటెంట్‌ను ఒకేసారి చూడవచ్చు.
అంతేకాదు.. రెండు యాప్‌లను స్క్రీన్‌పై పక్కపక్కనే ఉంచి ఏకకాలంలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఫోన్‌ను మడతపెట్టినప్పుడు 5.4 అంగుళాల పరిమాణంలో ఉంటుంది.
వివరాలు
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్
ఈ సమయంలో బెడ్‌సైడ్ క్లాక్ తరహాలోనూ ఉపయోగించుకోవచ్చు. విడ్జెట్స్, వెదర్, క్యాలెండర్, మ్యూజిక్ వంటి సమాచారాన్ని ఇందులో చూడొచ్చు.
ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లను భారత్‌లో 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజీ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఫోన్లు డీప్ బ్లాక్, సిల్వర్, గ్లేసియర్ బ్లూ, కొత్తగా పరిచయం చేసిన బర్గుండీ రంగుల్లో లభిస్తాయి.
ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఏఐ ఆధారిత సిరి, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి కృత్రిమ మేధ ఆధారిత టూల్స్‌ను ఇందులో అందించారు.
ఏ20 ప్రో చిప్‌తో పాటు కొత్త సెవెన్-కోర్ జీపీయూ, సిక్స్-కోర్ సీపీయూ ఉండటంతో ఫోన్ పనితీరు, సామర్థ్యం మరింత పెరిగినట్లు ఆపిల్ తెలిపింది.
వివరాలు
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్
బ్యాటరీ విషయంలోనూ ఐఫోన్ 18 ప్రోలో మెరుగుదలలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటల వరకు వినియోగించుకోవచ్చని సంస్థ పేర్కొంది.
వీడియో ప్లేబ్యాక్ 36 గంటల వరకు ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతం వరకు ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది.
కెమెరా విభాగంలో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరాను అందించారు.
ఇందులో ఆస్ట్రోఫొటోగ్రఫీ, నైట్ మోడ్ వంటి ఫీచర్లను మరింత మెరుగుపరిచారు.
4కే రిజల్యూషన్, డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌లో టైమ్‌ల్యాప్స్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. ప్రొ కంట్రోల్స్, యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
వివరాలు
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మరింత పెద్దది
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 6.9 అంగుళాల పరిమాణంతో వస్తోంది.
ఐఫోన్ 18 ప్రోలో ఉన్న ఫీచర్లనే ఇందులో మరింత విస్తృతంగా అందించారు. బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పెంచారు.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 గంటల వరకు వినియోగించుకోవచ్చని, వీడియో ప్లేబ్యాక్ 45 గంటల వరకు ఉంటుందని ఆపిల్ తెలిపింది.
వివరాలు
ఎయిర్‌పాడ్స్ 5లోనూ కొత్త ఫీచర్లు
ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు యాపిల్ ఎయిర్‌పాడ్స్ 5ను కూడా పరిచయం చేసింది.
ఇవి ఓపెన్ ఇయర్ డిజైన్‌తో వస్తాయి. గత తరం ఎయిర్‌పాడ్స్‌తో పోలిస్తే బయటి శబ్దాల తగ్గింపు సామర్థ్యం మరో 50 శాతం మెరుగుపడినట్లు సంస్థ తెలిపింది.
లైవ్ ట్రాన్స్‌లేషన్, సిరి వంటి ఇంటెలిజెంట్ ఫీచర్లను హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు.
కెమెరా రిమోట్, వాల్యూమ్ స్వైప్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఎయిర్‌పాడ్స్ 5లో ఉన్నాయి.
వివరాలు
ఆపిల్ వాచ్ సిరీస్ 12, అల్ట్రా 4
ఆపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రా 4లను కూడా సంస్థ ఆవిష్కరించింది. వీటిలో ఏఐ ఆధారిత ఆడియో ఫీచర్లను అందించారు.
'లైవ్ రివైండ్' ఫీచర్ ద్వారా 15 సెకన్ల ముందు జరిగిన సంభాషణను తిరిగి వినే అవకాశం ఉంటుంది.
కొత్త హెల్త్ సెన్సర్ వ్యవస్థతో వచ్చిన ఈ వాచ్‌లలో మెరుగైన ఈసీజీ, ఆప్టికల్ సెన్సింగ్ సదుపాయాలు ఉన్నాయి.
హృదయ స్పందనను ప్రతి ఐదు సెకన్లకు ఒకసారి నమోదు చేస్తాయి. గత మోడళ్లతో పోలిస్తే ఇది 60 రెట్లు ఎక్కువగా డేటాను నమోదు చేసే సామర్థ్యంగా పేర్కొన్నారు.
అంతేకాదు.. నిద్ర, రక్తానికి సంబంధించిన డేటాను సేకరించి, వినియోగదారుడి వాస్తవ వయసుతో ఆరోగ్య సంకేతాలను పోల్చి చూపించే సదుపాయాన్ని కూడా అందించారు.
వివరాలు
కొత్త ఉత్పత్తులతో ఆపిల్ సందడి
కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లను ఆపిల్ ప్రదర్శించింది.
ఫోల్డబుల్ వెర్షన్‌తో పాటు కొత్త ఐఫోన్లలో అత్యుత్తమ బ్యాటరీ, కెమెరా సామర్థ్యాలను అందించినట్లు సంస్థ వెల్లడించింది.
ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు ఎయిర్‌పాడ్స్ 5, యాపిల్ వాచ్ సిరీస్ 12, అల్ట్రా 4లను కూడా ఆవిష్కరించి తన ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించింది.