Page Loader
Apple iPhone SE 4 :రేపు విడుదల కానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 .. డిజైన్, ఫీచర్లు తెలుసుకోండి!
రేపు విడుదల కానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 .. డిజైన్, ఫీచర్లు తెలుసుకోండి!

Apple iPhone SE 4 :రేపు విడుదల కానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 .. డిజైన్, ఫీచర్లు తెలుసుకోండి!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఆపిల్ ప్రేమికులకు శుభవార్త. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ SE 4 త్వరలోనే విడుదల కానుంది. ఫిబ్రవరి 11న అధికారికంగా ఈ కొత్త మోడల్ లాంచ్ కానుంది. అత్యాధునిక ఫీచర్లతో రానున్న ఈ ఐఫోన్ గురించి ఇప్పటికే ప్రముఖ ఆపిల్ విశ్లేషకుడు మార్క్ గుర్మాన్ ఆసక్తికరమైన సమాచారం అందించారు. గత నివేదికల ప్రకారం, 2022 మార్చిలో విడుదలైన ఐఫోన్ SE 3rd జనరేషన్ తర్వాత ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. దాదాపు మూడు సంవత్సరాల తరువాత కొత్త SE మోడల్ మార్కెట్‌లోకి రాబోతుండటంతో ఐఫోన్ ప్రియులలో మరింత ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ పెరుగుతోంది.

వివరాలు 

SE 4 తక్కువ ఖర్చుతో..

పాత డిజైన్‌కు బదులుగా, ఐఫోన్ 14 తరహా మోడ్రన్ లుక్ రానుందని, హోమ్ బటన్, టచ్ ఐడీ తొలగించబడతాయని, దాని స్థానంలో ఫేస్ ఐడి టెక్నాలజీ అందించబడుతుందని అంచనా. లీకైన డమ్మీ యూనిట్ల ఆధారంగా ఈ మోడల్ ట్రెడిషనల్ నాచ్ డిజైన్, సింగిల్ రియర్ కెమెరా, యాక్షన్ బటన్ వంటి మార్పులతో రావొచ్చని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత SE 3 మోడల్ ప్రారంభ ధర $429 కాగా, కొత్త SE 4 మోడల్ ధర $500 వరకు ఉండొచ్చని అంచనా. తాజా ఐఫోన్ 16 మోడల్ ధర $799 ఉండటంతో, SE 4 తక్కువ ఖర్చుతో ఉత్తమ ఐఫోన్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.

వివరాలు 

EU నిబంధనల ప్రకారం USB-C పోర్ట్

కొత్త మోడల్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే, ఫేస్ ఐడి,USB-C పోర్ట్,48MP రియర్ కెమెరా,A18 చిప్,8GB RAM వంటి అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ముఖ్యంగా, ఇది ఆపిల్ స్వయంగా డెవలప్ చేసిన మొదటి 5G మోడెమ్ కలిగి ఉండే అవకాశం ఉంది. 128GB బేస్ స్టోరేజ్, 12MP ఫ్రంట్ కెమెరా, 20 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంతో ఈ ఫోన్ రానుంది. EU నిబంధనల ప్రకారం USB-C పోర్ట్ అందించబడుతుందని కూడా అంచనా. ఫిబ్రవరి 11న అధికారిక లాంచ్ అయిన తరువాత, ఈ మోడల్ గురించి మరింత క్లారిటీ వస్తుంది. ఐఫోన్ 14 తరహాలో ప్రతిష్టాత్మక ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో రాబోతున్న ఈ ఐఫోన్ SE 4 కోసం ఆపిల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.