LOADING...
macOS Tahoe: ఆపిల్ macOS Tahoe విడుదల.. కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, మెరుగైన AI ఫీచర్లు!
ఆపిల్ macOS Tahoe విడుదల.. కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, మెరుగైన AI ఫీచర్లు!

macOS Tahoe: ఆపిల్ macOS Tahoe విడుదల.. కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, మెరుగైన AI ఫీచర్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
12:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ తన మాక్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి తాజా వర్షన్‌ macOS 26 'Tahoe'ను అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన ఓఎస్‌లో ప్రధాన ఆకర్షణ 'లిక్విడ్ గ్లాస్' డిజైన్ భాష. డాక్, మెనూ బార్ వంటి సిస్టమ్ అంశాలు ఇప్పుడు అద్భుతమైన పారదర్శక రూపాన్ని సంతరించుకున్నాయి. అలాగే, Apple Intelligence ఆధారిత స్మార్ట్ టూల్స్, పర్సనలైజ్డ్ ఫీచర్లు, మల్టీ-డివైస్ కంటిన్యూయిటీ మరింత మెరుగుపడినట్టు యాపిల్ పేర్కొంది.

Details

మ్యాక్‌కి ఫోన్‌ అప్లికేషన్.. కంట్రోల్ సెంటర్ రూపురేఖలు మారినట్టే! 

ఈ అప్‌డేట్‌లో ఒక విశేషమైన కొత్త ఫీచర్ ఫోన్‌ యాప్‌. ఇది ద్వారా యూజర్లు తమ iPhone ద్వారా కాల్స్ చేయగలుగుతారు, రీసెంట్ కాల్స్, వాయిస్‌మెయిల్ చూసుకోవచ్చు. అంతేకాదు కాల్స్‌ స్క్రీనింగ్ వంటి కొత్త ఫీచర్లకు ఇది మద్దతు ఇస్తుంది. అదే సమయంలో కంట్రోల్ సెంటర్ పూర్తిగా డిజైన్ మార్చారు. డాక్‌లో కొత్త యాప్‌ ఐకాన్లు, ఫోల్డర్లకు రంగులు, ఎమోజీలు లేదా గుర్తులు జోడించుకునే అవకాశం కూడా ఉంది

Details

Spotlight‌తో నేరుగా చర్యలు

Spotlight శోధన టూల్‌ ఇప్పుడు మరింత శక్తివంతంగా మారింది. యూజర్లు నేరుగా ఇమెయిల్ పంపడం, నోట్ క్రియేట్ చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు. శోధన ఫలితాలు మెరుగైన ర్యాంకింగ్‌తో వచ్చేలా మారు బడి, కొత్త బ్రౌజింగ్ వ్యూస్, క్విక్‌ కీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గేమింగ్ కోసం ప్రత్యేక అప్లికేషన్ తమ అనుభవాలను రికార్డ్ చేసుకునేందుకు 'జర్నల్ యాప్' macOS 26లో భాగమైంది. ఇది ఇతర యాపిల్ డివైసులతో సింక్‌ అవుతుంది. గేమింగ్ ప్రియుల కోసం 'కొత్త గేమ్స్ యాప్' అందుబాటులోకి వచ్చింది. అన్ని గేమ్‌లను ఒకేచోట నిర్వహించడంతో పాటు Game Overlay సాయంతో గేమ్ మధ్యలోనే సెట్టింగ్స్ మార్చడం, స్నేహితులను ఆహ్వానించడం సాధ్యమవుతుంది.

Details

Safari, Messages, Photos, Notes  అన్నింటిలోనూ కొత్తదనం 

Safari బ్రౌజర్‌ ఇప్పుడు ఫ్లోటింగ్ ట్యాబ్స్, వేగవంతమైన పనితీరుతో రీడిజైన్‌ అయ్యింది. Messages యాప్‌లో గ్రూప్ పోల్స్, టైపింగ్ ఇండికేటర్, కస్టమ్ బ్యాక్‌గ్రౌండ్ ఫీచర్లు చేరాయి. Photos, Notes యాప్‌లలో Markdown సపోర్ట్, ఆడియో ట్రాన్స్‌క్రిప్షన్ వంటి మెరుగులు కలిపారు. 'Live Translation' ఫీచర్‌తో మెసేజ్‌లు, ఫేస్‌టైమ్, ఫోన్‌కాల్స్‌లో అనువాదం సహజంగా లభిస్తుంది.