LOADING...
Apple: ఈ వారం కొత్త M5 చిప్‌తో ఐప్యాడ్లు, విజన్ ప్రో ప్రకటించే అవకాశం 
ఈ వారం కొత్త M5 చిప్‌తో ఐప్యాడ్లు, విజన్ ప్రో ప్రకటించే అవకాశం

Apple: ఈ వారం కొత్త M5 చిప్‌తో ఐప్యాడ్లు, విజన్ ప్రో ప్రకటించే అవకాశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈసారి దృష్టి ప్రధానంగా iPad, Mac, Vision Pro పరికరాలపై ఉంది. సమాచారం ప్రకారం, ఆపిల్ ఈ వారం కొత్త iPad Pro, Vision Pro హెడ్‌సెట్, బేస్ 14-అంగుళాల MacBook Pro మోడళ్లను ప్రకటించే అవకాశముంది. ఇవన్నీ తాజా M5 చిప్ ఆధారంగా పనిచేయనున్నాయి. సాధారణంగా వేదికపై జరిపే భారీ ఈవెంట్లకు బదులుగా, ఈ సారి ఆపిల్ ఆన్‌లైన్ ప్రకటనలు, చిన్న ప్రమోషనల్ వీడియోల ద్వారా ఈ ఉత్పత్తులను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

పరికరం వివరాలు 

12GB ర్యామ్‌తో వచ్చే కొత్త iPad Pro

అధికారిక ప్రకటనకు ముందు రష్యాలో కొత్త iPad Pro మోడల్ అన్‌బాక్సింగ్ వీడియోలలో కనిపించింది. ఈ టాబ్లెట్‌లో M5 ప్రాసెసర్ తో పాటు కనీసం 12GB ర్యామ్ అందించనున్నారు. బయటకు పెద్దగా మార్పులు లేవు, అయితే ఒక చిన్న తేడా మాత్రం ఉంది - వెనుక భాగంలో ఉండే "iPad Pro" బ్రాండింగ్‌ను తొలగించారు. ప్రారంభ బెంచ్‌మార్క్ టెస్టుల ప్రకారం, కొత్త మోడల్ గత M4 వెర్షన్ కంటే గణనీయమైన పనితీరు మెరుగుదల చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

టెక్ అప్‌గ్రేడ్‌లు 

Vision Pro హెడ్‌సెట్‌కి కూడా M5 అప్‌డేట్

ఆపిల్ Vision Pro హెడ్‌సెట్ కూడా ఈసారి కొత్త M5 చిప్‌తో రాబోతోందని సమాచారం. కొత్త మోడల్‌లో "Dual Knit Band" అనే సౌకర్యవంతమైన కొత్త బ్యాండ్ డిజైన్ Space Black కలర్ ఆప్షన్ ఉండొచ్చని అంచనా. ఇక మరోవైపు, ప్రారంభ స్థాయి 14-అంగుళాల MacBook Pro కూడా M5 చిప్‌తో లాంచ్‌కి సిద్ధంగా ఉంది. అయితే, M5 Pro,M5 Max వేరియంట్లు మాత్రం 2026లో విడుదలయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని ద్వారా ఆపిల్ తన కొత్త M5 చిప్ సిరీస్‌ను దశలవారీగా మార్కెట్లో ప్రవేశపెట్టే వ్యూహం అవలంబిస్తోందని తెలుస్తోంది.