Apple watchOS 10: ఈ ఆపిల్ వాచ్‌లో మీ మూడ్ రికార్డ్ చేసే సౌకర్యం.. అదెలాగో తెలుసుకోండి
ఆపిల్ watchOS 10 సెప్టెంబర్ 18వ తేదీన మార్కెట్‌లో విడుదలైంది. దీనిలో ఆరోగ్యం, వ్యాయామం, మానసిక ఆరోగ్యానికి సంబంధిత ఫీచర్లు ఉన్నాయి. దీనిలో ఉన్న మైండ్ ఫుల్ నెస్(Mindfulness app) యాప్ సాయంతో మీ రోజువారి మూడ్స్ రికార్డు చేయవచ్చు. అంటే ఒక రోజులో మీ మూడ్ ఎలా ఉందో దాన్ని అక్కడ రికార్డు చేయవచ్చు. దీనివల్ల మీ మానసిక ఆరోగ్యంపై ఏది ప్రభావం చూపిస్తుందనేది అర్థమవుతుంది. మైండ్ ఫుల్ నెస్ యాప్ లో మన మూడ్స్ ఎలా రికార్డ్ చేయాలి? మీ మూడ్స్ లాగిన్ చేయాలంటే మైండ్ ఫుల్ నెస్ యాప్ ఓపెన్ చేసి స్టేట్ ఆఫ్ మైండ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
హెల్త్ యాప్‌లో కనిపించే మూడ్ రికార్డ్స్
ఇప్పుడు మూమెంటరీ ఎమోషన్, డైలీ మూడ్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ క్షణం మీకు ఏమనిపించిందో రికార్డ్ చేయడానికి మూమెంటరీ ఎమోషన్ సెలెక్ట్ చేసుకోవాలి. డే మొత్తంలో ఏ విధంగా ఫీల్ అయ్యారో రికార్డ్ చేయడానికి డైలీ మూడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు 7ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీరు రికార్డ్ చేయాలనుకున్న మూడ్.. వెరీ ప్లెజెంట్ నుండి వెరీ అన్ ప్రెజెంట్ వరకు ఉంటుంది. ఆ 7ఆప్షన్ల లోంచి మీరు ఎలా ఫీలయ్యారనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ మూడ్స్ రికార్డ్ అయిన తర్వాత హెల్త్ యాప్ ఓపెన్ చేసి, మెంటల్ వెల్ బీయింగ్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మీ పూర్తి మూడ్ రికార్డ్స్ వచ్చేస్తాయి.
ఆరోగ్య సమాచారం వైద్యులకు షేర్ చేసే అవకాశం
హెల్త్ యాప్ లో మీరు రికార్డ్ చేసిన మూడ్స్ కనిపిస్తాయి. అంతేకాదు.. మీ జీవనశైలిపై నిద్ర, ఎండలో తిరగడం, వ్యాయామం ప్రభావం ఎంత ఉందనేది ఇందులో తెలుస్తుంది. అలాగే ఒత్తిడి, అనవసర ఆందోళన వల్ల మీరెలా ఫీలవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఈ డాటా మొత్తం వైద్యులకు షేర్ చేయవచ్చు. తద్వారా మీరు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే అవకాశం వైద్యులకు సులువుగా ఉంటుంది. వాచ్ ఓఎస్10 లో బ్లూటూత్ సెన్సార్ సపోర్ట్ సాయంతో సైక్లింగ్ వర్కౌట్, హైకింగ్ అప్ గ్రేడ్స్ ఇంకా కంటికి సంబంధించిన ఆరోగ్య సమాచారం మొత్తం ఫీడ్ అవుతుంది.