Page Loader
Apple foldable phone: ఫోల్డబుల్ మార్కెట్లోకి యాపిల్‌ ఎంట్రీ.. 2026లో రిలీజ్!
ఫోల్డబుల్ మార్కెట్లోకి యాపిల్‌ ఎంట్రీ.. 2026లో రిలీజ్!

Apple foldable phone: ఫోల్డబుల్ మార్కెట్లోకి యాపిల్‌ ఎంట్రీ.. 2026లో రిలీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడూ ఆ సంస్థ తీసుకొచ్చే కొత్త ఉత్పత్తుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల టెక్‌ రంగంలో ఫోల్డబుల్‌ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో యాపిల్‌ కూడా ఈ విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. దీనిపై టెక్‌ ప్రియులలో ఉత్కంఠ రేపుతోంది. తాజా నివేదికల ప్రకారం, యాపిల్‌ రెండు ఫోల్డబుల్‌ డివైజులపై పని చేస్తోందని తెలుస్తోంది. క్లామ్‌షెల్‌ స్టైల్‌ ఐఫోన్‌, 20 అంగుళాల ఫోల్డబుల్‌ ఐప్యాడ్‌ రూపంలో ఫోల్డబుల్‌ మార్కెట్లోకి అడుగుపెట్టనుందట. క్లామ్‌షెల్‌ డిజైన్‌లో శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌, మొటొరోలా రేజర్‌లకు పోటీగా, యాపిల్‌ తన మొదటి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

Details

7 అంగుళాల డిస్‌ప్లే 

7 అంగుళాల డిస్‌ప్లేతో దీన్ని అందుబాటులోకి తేనున్నారట. ఇక ఫోల్డబుల్‌ ఐప్యాడ్‌ విషయానికొస్తే, 20 అంగుళాల డిస్‌ప్లేతో ఇది వినియోగదారులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. ఫోల్డబుల్‌ ఫోన్ల విభాగంలో శాంసంగ్‌, హువావే, మొటొరోలా ఇప్పటికే తమ స్థానాన్ని పటిష్టం చేసుకున్నాయి. యాపిల్‌ రాకతో ఈ విభాగంలో పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ 2026లో విడుదల కానుంది. ఇది ఐఫోన్‌ 18గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ఫోల్డబుల్‌ ఐఫోన్‌, ప్రస్తుతం ఉన్న ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ కంటే పెద్ద స్క్రీన్‌తో రానుంది.