తదుపరి వార్తా కథనం

Apple's first foldable iPhone:క్లామ్‌షెల్ డిజైన్‌తో మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ఆపిల్.. లాంచ్ ఎప్పుడంటే
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 24, 2024
10:51 am
ఈ వార్తాకథనం ఏంటి
ఫోల్డబుల్ ఫోన్ లు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
ఇప్పటికే ఓపో, శాంసంగ్, వన్ ప్లస్, వీవో ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్లోకి అడుగుపెట్టేశాయి.
తాజాగా ఆపిల్ సంస్థ పోల్డబుల్ ఐఫోన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
క్లామ్ షెల్ డిజైన్‌తో 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ది ఇన్ఫర్మేషన్ నుండి ఓ నివేదిక వచ్చింది.
రాబోయే ఈ ఐఫోన్ పరికరం, అంతర్గతంగా V68గా పిలవబడే అవకాశం ఉంది.
Details
క్రీజ్ సమస్యను పరిష్కరించడంపై దృష్టి
ఈ ఐఫోన్‌ను మడత విప్పినప్పుడు కనిపించే క్రీజ్ సమస్యను పరిష్కరించడంపై ఆపిల్ దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ ఏడాది ప్రారంభంలో, ఆపిల్ మడతపెట్టే ఐఫోన్ కోసం రెండు ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది.
ఆపిల్ కేవలం ఫోల్డబుల్ ఐఫోన్‌ను మాత్రమే కాకుండా, MacBook లాంటి ఫోల్డబుల్ పరికరంతో కూడా పని చేస్తుందని రూమార్లు వినిపిస్తున్నాయి.