Apple iPhone 16: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 16
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త మైలురాయిని సృష్టించింది. 2025 తొలి 11 నెలల్లోనే 'ఐఫోన్ 16' 65 లక్షల యూనిట్లు విక్రయించబడటంతో, దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ విజయాన్ని ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం,ఆపిల్ విక్రయాలలో ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్లను మించిపోయింది. కేవలం ఐఫోన్ 16 మాత్రమే కాకుండా, ఐఫోన్ 15 కూడా టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల జాబితాలో నిలవటం యాపిల్ మార్కెట్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. భారత మార్కెట్‌లో, బడ్జెట్,మిడ్-రేంజ్ ఫోన్లకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనలో మార్పు చోటుచేసుకుంటున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
రికార్డు స్థాయిలో 9 బిలియన్ డాలర్ల దేశీయ అమ్మకాలు
ఆపిల్ భారతదేశంలో స్థానిక తయారీని పెంచడం,చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి వ్యూహాలు ఫలితాలను ఇచ్చాయి. తాజాగా బెంగళూరు,పూణే,నోయిడాలో మూడు కొత్త స్టోర్లను ప్రారంభించడంతో,దేశంలో యాపిల్ రిటైల్ స్టోర్ల సంఖ్య ఐదు వరకు పెరిగింది. అదనంగా,నో-కాస్ట్ ఈఎంఐ,క్యాష్‌బ్యాక్,బ్యాంక్ ఆఫర్లు వంటి సౌకర్యాలు ఖరీదైన ఫోన్లను సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో,యాపిల్ ఇండియా దేశీయంగా 9 బిలియన్ డాలర్ల రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. గ్లోబల్ వ్యాప్తంగా తయారైన ఐఫోన్లలో ప్రతి ఐదో ఫోన్ భారత్‌లోనే తయారవుతోంది. అంతేకాక,నవంబర్ నెలలో భారత్ నుండి 2బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి. అదనంగా, ప్రథమసారిగా ఐఫోన్ ప్రో,ప్రో మ్యాక్స్ వంటి హై-ఎండ్ మోడళ్లను కూడా భారత్‌లో అసెంబుల్ చేయడం ప్రారంభించింది.