LOADING...
Apple iPad: ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌ పనితీరుతో వచ్చే ఆపిల్‌ బడ్జెట్‌ ఐప్యాడ్
ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌ పనితీరుతో వచ్చే ఆపిల్‌ బడ్జెట్‌ ఐప్యాడ్

Apple iPad: ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌ పనితీరుతో వచ్చే ఆపిల్‌ బడ్జెట్‌ ఐప్యాడ్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌ తన ఎంట్రీ-లెవల్‌ ఐప్యాడ్‌కు సంబంధించి పెద్ద మార్పు ఆలోచిస్తున్నట్టు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. సాధారణంగా పాత చిప్‌లను ఉపయోగించే ఆపిల్‌, 2026లో వచ్చే బడ్జెట్‌ ఐప్యాడ్‌లోనే తాజా ఐఫోన్‌ 17లో ఉన్న A19 ప్రాసెసర్‌ను పెట్టే అవకాశముందని Macworld రిపోర్ట్ తెలిపింది. ఇది నిజమైతే దాదాపు పది సంవత్సరాల తర్వాత మొదటిసారి తక్కువ ధర ఐప్యాడ్‌లో నూతన తరం చిప్‌ను ఆపిల్‌ ఉపయోగించనున్నట్టే అవుతుంది.

వివరాలు 

ఐప్యాడ్ పనితీరుపై సంభావ్య ప్రభావం 

2026 బడ్జెట్ ఐప్యాడ్‌లో A19 చిప్ వాడితే పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించే అవకాశం ఉంది. ఈ చిప్ స్పీడ్‌, పవర్‌ ఎఫిషెన్సీ విషయంలో ఆపిల్‌ తాజా తరం ప్రాసెసర్లలో ఒకటి. ఇప్పటివరకు ఎంట్రీ లెవల్ మోడళ్లలో పాత చిప్‌లను పెట్టే ఆపిల్‌ విధానంతో పోల్చితే, ఇది ఒక పెద్ద అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు.

వివరాలు 

ఇంతకాలం ఆపిల్‌ అనుసరించిన చిప్ స్ట్రాటెజీ

ఇప్పటి వరకు ఆపిల్‌ బడ్జెట్‌ ఐప్యాడ్‌లలో ఒకటి లేదా రెండు జనరేషన్‌ల పాత ప్రాసెసర్‌లను వాడుతూ వచ్చింది. ఉదాహరణకు ప్రస్తుత iPad 11లో 2022లో వచ్చిన iPhone 14 సిరీస్‌లోని A16 చిప్ ఉంది. అంతకుముందు మోడల్‌లో 2020లో వచ్చిన A14 చిప్‌ను ఉపయోగించారు. చివరిసారి ప్రస్తుత తరం చిప్‌ను లైట్‌-రేంజ్ ఐప్యాడ్‌లో వాడింది iPad 4 కాలంలోనే, అప్పట్లో AX సిరీస్ టాబ్లెట్‌ చిప్‌ను వాడారు.

Advertisement

వివరాలు 

కొత్త ఐప్యాడ్‌ కోడ్‌నేమ్‌లపై సందేహాలు

రాబోయే ఐప్యాడ్‌కు సంబంధించిన J581, J588 కోడ్‌నేమ్‌లు కొంత గందరగోళం సృష్టించాయి. ఆపిల్‌ సాధారణంగా తమ ఇంటర్నల్‌ ఐడెంటిఫైయర్లను వరుస క్రమంలో వాడుతుంది. ఇంతకుముందు వచ్చిన నివేదికల్లో J581, J582 కోడ్‌లు ఎంట్రీ లెవల్‌ ఐప్యాడ్‌కు ఉపయోగించినట్టు, అలాగే iPad mini కోసం J510, J511 ఐడెంటిఫైయర్లు కనిపించినట్టు సమాచారం. ఈ మార్పులు Macworld తెలిపిన చిప్‌ స్ట్రాటెజీపై అనుమానాలు పెంచుతున్నాయి.

Advertisement

వివరాలు 

2026లో వచ్చే టాబ్లెట్ లైనప్

బడ్జెట్‌ ఐప్యాడ్‌తో పాటు, 2026లో కొత్త iPad Air కూడా రావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఆ మోడల్‌లో ఆపిల్‌ తాజా M4 చిప్ ఉండే అవకాశం ఉంది. మాక్‌, ఐప్యాడ్‌లలో కొత్త తరం సిలికాన్‌కు ఆపిల్‌ మారుతున్న నేపథ్యంలో ఇది సహజమైన అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు. అంతేకాకుండా, 2026లో రానున్న ఈ రెండు ఐప్యాడ్‌ మోడళ్లలో కూడా మెరుగైన కనెక్టివిటీ కోసం ఆపిల్‌ కొత్త N1 నెట్‌వర్కింగ్‌ చిప్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Advertisement