Apple: బడ్జెట్ సెగ్మెంట్‌లోకి యాపిల్ అడుగు.. కొత్త సబ్-$1,000 మాక్‌బుక్ సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ కంపెనీ తొలిసారి తక్కువ ధరలో ల్యాప్‌టాప్ తీసుకురానుందని సమాచారం. విద్యార్థులు, చిన్న వ్యాపారాలు,సాధారణంగా ఇంట్లో వాడే యూజర్లను టార్గెట్ చేస్తూ సబ్-$1,000 మాక్‌బుక్‌ను లాంచ్ చేయడానికి ఆపిల్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకూ ప్రీమియం ప్రాడెక్ట్‌లపైనే దృష్టి పెట్టిన ఆపిల్, ఈసారి ఎంట్రీ లెవెల్ మార్కెట్ వైపు అడుగు వేస్తుండటం పెద్ద మార్పుగా చూస్తున్నారు. 'J700' కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తోన్న ఈ కొత్త మాక్‌బుక్ ప్రస్తుతం ఆపిల్ టెస్టింగ్ సెంటర్లలో ట్రయల్స్ దశలో ఉంది. విదేశీ సప్లయర్ల వద్ద ప్రారంభ ఉత్పత్తి పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
వివరాలు
వినియోగదారుల లక్ష్యంగా Chromebook,ఎంట్రీ-లెవల్ Windows PC
ఈ బడ్జెట్ మాక్‌బుక్ ప్రధానంగా క్రోమ్‌బుక్‌లు, ఎంట్రీ లెవెల్ విండోస్ ల్యాప్‌టాప్ వినియోగదారులను ఆకర్షించడానికి ప్లాన్ చేశారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్, డాక్యుమెంట్స్ వర్క్, లేదా తేలికపాటి వీడియో/ఫోటో ఎడిటింగ్ చేసే యూజర్లకు ఇది సరిపోతుందన్న అంచనా. ఇంకా, ఐప్యాడ్ కొనాలని చూస్తున్న కానీ టాబ్లెట్ కంటే ల్యాప్‌టాప్ అనుభవం ఇష్టపడేవారిని కూడా యాపిల్ టార్గెట్ చేస్తోంది.
వివరాలు
కంప్యూటర్-నిర్దిష్ట చిప్‌కు బదులుగా ఐఫోన్ ప్రాసెసర్
ఈ కొత్త మాక్‌బుక్ ధరను తగ్గించడానికి, ఆపిల్ కంప్యూటర్లకు వాడే ప్రత్యేక M-సిరీస్ చిప్ స్థానంలో ఐఫోన్‌లో వాడే ప్రాసెసర్‌ను ఉపయోగించనుంది. అలాగే డిస్‌ప్లే కూడా సాధారణ LCD స్క్రీన్‌నే ఉంటుందని సమాచారం. స్క్రీన్ సైజ్ ప్రస్తుతం ఉన్న 13.6 ఇంచుల మాక్‌బుక్ ఎయిర్ కంటే చిన్నదిగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇదే యాపిల్ తీసుకురాబోయే అత్యంత చిన్న మాక్ డిస్‌ప్లే అవుతుంది.
వివరాలు
ఆపిల్ PC మార్కెట్ వాటాను పెంచే అవకాశం
ఈ ల్యాప్‌టాప్ విజయవంతమైతే ఆపిల్ గ్లోబల్ PC మార్కెట్ షేరులో పెద్ద పెరుగుదల రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆపిల్‌కు ప్రపంచ ల్యాప్‌టాప్/PC మార్కెట్లో సుమారు 9% షేర్ ఉంది. లెనోవో, హెచ్పీ, డెల్ తర్వాత నాల్గో స్థానంలో ఉంది. తక్కువ ధరతో, ఆపిల్ డిజైన్‌తో, అలాగే ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌లకు ఉన్న సాఫ్ట్ కనెక్టివిటీతో వచ్చే ఈ కొత్త మాక్‌బుక్ అమెరికా వంటి మార్కెట్లలో పెద్ద స్పందన తెచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.