LOADING...
Apple: సిరి కోసం గూగుల్‌కి సంవత్సరానికి $1 బిలియన్ చెల్లించనున్న ఆపిల్
సిరి కోసం గూగుల్‌కి సంవత్సరానికి $1 బిలియన్ చెల్లించనున్న ఆపిల్

Apple: సిరి కోసం గూగుల్‌కి సంవత్సరానికి $1 బిలియన్ చెల్లించనున్న ఆపిల్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ కంపెనీ గూగుల్‌తో భారీ ఒప్పందం చేయడానికి సిద్ధమవుతోంది. సిరి అనే వాయిస్ అసిస్టెంట్‌ను మరింత శక్తివంతం చేసేందుకు, ఆపిల్ ప్రతి సంవత్సరం గూగుల్‌కు సుమారు 1 బిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ సమాచారం. గూగుల్ రూపొందించిన జెమినై AI మోడల్ ప్రత్యేకంగా మార్చిన వెర్షన్‌ను ఆపిల్ ఉపయోగించనుంది. దీంతో సిరి మరింత క్లిష్టమైన పనులను కూడా అర్థం చేసుకుని, సమాధానాలు ఇవ్వగల సామర్థ్యాన్ని సాధించనుంది.

వ్యూహాత్మక నిర్ణయం 

ఆపిల్ తన ఇన్-హౌస్ టెక్ నుండి థర్డ్-పార్టీ సొల్యూషన్స్ కు మారుతోంది

ఇప్పటి వరకు ఆపిల్ ఎక్కువగా తన సొంత టెక్నాలజీని మాత్రమే వినియోగిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు తాత్కాలికంగా గూగుల్ జెమినై మోడల్‌ను వాడి, తర్వాత తన స్వంత శక్తివంతమైన AI‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉంది. గూగుల్ ఇచ్చే ఈ కొత్త AI మోడల్‌లో 1.2 ట్రిలియన్ పరామీటర్లు ఉండగా, ప్రస్తుతం ఆపిల్ వాడుతున్న మోడల్స్‌లో ఇది కేవలం 150 బిలియన్ పరిధిలోనే ఉంది.

మోడల్ టెస్టింగ్ 

పోటీదారుల నుండి AI మోడళ్లపై ఆపిల్ అన్వేషణ 

ఈ సంవత్సరం ఆపిల్, OpenAI, Anthropic కంపెనీల AI మోడళ్లను కూడా పరీక్షించింది. మూడింటిని పరిశీలించిన తర్వాత, చివరకు గూగుల్ జెమినైనే ఎంచుకున్నట్లు సమాచారం. సరికొత్త సిరి వచ్చే ఏడాది వసంత కాలంలో (Spring) విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ ఇంకా కొంత సమయం ఉండడంతో షెడ్యూల్ మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రాజెక్ట్ వివరాలు 

ప్రాజెక్ట్ గ్లెన్‌వుడ్: ఆపిల్ సిరి పునరుద్ధరణ, గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్ 

ఈ ప్రాజెక్ట్‌కు "ప్రాజెక్ట్ గ్లెన్‌వుడ్" అనే కోడ్ నేమ్ పెట్టారు. దీన్ని మైక్ రాక్‌వెల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయనే ప్రస్తుతం సిరి రీవ్యాంప్‌పై పనిచేస్తున్నారు, అలాగే ఆపిల్ సాఫ్ట్‌వేర్ హెడ్ క్రేగ్ ఫెడెరిఘి కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, సిరిలో సారాంశాలు చెప్పడం, పనులను ప్లాన్ చేయడం వంటి ముఖ్యమైన ఫీచర్లు గూగుల్ జెమినై ద్వారా పని చేస్తాయి. అయితే, యూజర్ల డేటా భద్రత కోసం కొన్నివరకు ఆపిల్‌ సొంత AI సిస్టమ్‌లను యథావిధిగా కొనసాగించనుంది.