Apple Watch: ఆపిల్ వాచ్‌లో కొత్త హెల్త్ ఫీచర్.. ఇకపై హైపర్‌టెన్షన్ (బీపీ) హెచ్చరికలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ సంస్థ తన తాజా watchOS 26 అప్‌డేట్‌తో ప్రవేశపెట్టిన హైపర్‌టెన్షన్ నోటిఫికేషన్ ఫీచర్‌ను భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆధునిక ఆరోగ్య ఫీచర్ ద్వారా, ఆపిల్ వాచ్ సేకరించే హార్ట్ డేటాను వరుసగా 30 రోజులపాటు విశ్లేషించి,యూజర్‌లో రక్తపోటు పెరిగిన సూచనలు నిరంతరం కనిపిస్తే ముందుగానే అలర్ట్ రూపంలో హెచ్చరికను పంపుతుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. వినియోగదారుల వద్ద Apple Watch Series 9, Ultra 2 లేదా వాటికంటే కొత్త మోడల్ ఉండాలి. అదనంగా,వాచ్‌లో watchOS 26, అలాగే iPhone 11 లేదా ఆపై మోడల్‌లో iOS 26 ఇన్‌స్టాల్ చేయబడిఉండాలి.
వివరాలు
ఈ సదుపాయానికి వీరు అర్హులు కారు
అలాగే వాచ్‌లోని 'రిస్ట్ డిటెక్షన్' ఫీచర్ యాక్టివ్‌గా ఉండటం తప్పనిసరి. వినియోగదారుల వయస్సు కనీసం 22 సంవత్సరాలు పైబడై ఉండాలి. గర్భిణీలు ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి అనర్హులు కాగా, ఇప్పటికే హైపర్‌టెన్షన్ డయాగ్నోస్ అయి చికిత్స పొందుతున్న వారు కూడా ఈ సదుపాయానికి అర్హులు కారు. సెటప్ ప్రక్రియ కోసం మొదట ఐఫోన్‌లో హెల్త్ యాప్‌ను ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్ ద్వారా Health Checklistలోని 'Hypertension Notifications' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం వయస్సు వివరాలు, ఆరోగ్య చరిత్రను నిర్ధారించి, అందులో ఇచ్చిన సూచనలను అనుసరించాల్సి ఉంటుంది. సెటప్ పూర్తైన తర్వాత, గత 30 రోజులుగా సేకరించిన హార్ట్ డేటాలో హైపర్‌టెన్షన్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే, ఆపిల్ వాచ్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తుంది.
వివారాలు
హెచ్చరిక అందిన వెంటనే.. వైద్య నిపుణులను సంప్రదించాలి
హెచ్చరిక అందిన వెంటనే వినియోగదారులు వైద్య నిపుణులను సంప్రదించి రక్తపోటు పరీక్ష చేయించుకోవాలని ఆపిల్ సూచిస్తోంది. అదే సమయంలో Blood Pressure Log ఫీచర్ సెటప్ చేసి, థర్డ్-పార్టీ బీపీ కఫ్ ఉపయోగించి ఏడురోజుల పాటు బీపీ రీడింగ్స్‌ను నమోదు చేయాలని సూచిస్తున్నారు. ఆపిల్ వాచ్‌లోని ఆప్టికల్ సెన్సార్ రక్తనాళాలు గుండె మ్రోగుడుకు ఎలా స్పందిస్తున్నాయో పరిశీలిస్తూ, ఆల్గోరిథమ్ సహాయంతో బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం హార్ట్ డేటా విశ్లేషణ కొనసాగుతుంది. దీని ద్వారా రక్తపోటు అధికంగా ఉండే పరిస్థితులకు సంభందించిన సంకేతాలు నిరంతరంగా కనిపిస్తే, వాడుకదారులకు ముందస్తు అలర్ట్ రూపంలో హెచ్చరిక పంపబడుతుంది.
వివరాలు
కేవలం ముందస్తు హెచ్చరికల కోసం మాత్రమే ఈ ఫీచర్
అయితే, ఈ ఫీచర్ వ్యాధి నిర్ధారణకు (డయాగ్నోసిస్), వైద్య చికిత్సకు లేదా మందుల నిర్వహణకు కాకుండా కేవలం ముందస్తు హెచ్చరికల కోసం మాత్రమే రూపొందించబడిందని ఆపిల్ స్పష్టం చేసింది. వినియోగదారులు దీనిని మెడికల్ డయాగ్నోసిస్‌గా పరిగణించకుండా, అవసరమైనప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచించింది.