Apple Watch: భారతదేశంలో భారీగా తగ్గినా ఆపిల్ వాచ్ ధరలు .. ఈ బెస్ట్ డీల్స్ మీకోసం..!
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్‌లపై ఇప్పుడు భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
ఈ సమయంలో మీరు ఐఫోన్ కొనుగోలు చేసి, ఆపిల్ వాచ్ పై మంచి డీల్ కోసం చూస్తున్నట్లయితే, ఇది సరైన సమయం.
ప్రస్తుత రిపబ్లిక్ డే సేల్స్ కారణంగా, వివిధ స్మార్ట్‌వాచ్‌లపై భారీ ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
ఈ తగ్గింపులు క్రోమా, అమెజాన్, ఇతర ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లపై అందుబాటులో ఉన్నాయి.
ఆపిల్ వాచ్‌లు తగ్గింపు ధరలతో
ఆపిల్ వాచ్ సిరీస్ 10, 9, 8, మరియు SE 2 మోడల్స్ పై అధిక ధర తగ్గింపులు పొందవచ్చు. క్రోమా, అమెజాన్ వంటి వెబ్‌సైట్లలో ఆపిల్ వాచ్‌ల ధరలు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి.
వివరాలు
ఆపిల్ వాచ్ సిరీస్ 10 (GPS)
42mm డయల్‌తో కూడిన ఆపిల్ వాచ్ సిరీస్ 10 (GPS) ప్రస్తుతం క్రోమాలో రూ. 44,990 ధరకు లభ్యమవుతుంది.
ఇది అసలు ధర రూ. 46,900 కంటే రూ. 1,910 తగ్గింపు. అదనంగా, ఐజీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 2,500 వరకు అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.
దీని ద్వారా, వినియోగదారులు ఈ ఆపిల్ వాచ్‌ని రూ. 42,490 ధరకు కొనుగోలు చేయవచ్చు. మొత్తం తగ్గింపు రూ. 4,410 వరకు ఉంటుంది.
వివరాలు
ఆపిల్ వాచ్ సిరీస్ 9 (GPS)
45mm మోడల్ ఆపిల్ వాచ్ సిరీస్ 9 (GPS) క్రోమాలో రూ. 33,990 నుండి ప్రారంభమవుతుంది. ఈ మోడల్ అసలు ధర రూ. 44,900. వినియోగదారులు ఈ మోడల్‌పై రూ. 10,910 తగ్గింపు పొందవచ్చు. కానీ, ఈ మోడల్‌కు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో లేవు.
ఆపిల్ వాచ్ సిరీస్ 8 (GPS)
45mm మిడ్‌నైట్ అల్యూమినియం మోడల్ ఆపిల్ వాచ్ సిరీస్ 9 కొనుగోలు చేయడం ఉత్తమం. ఇది ఆపిల్ వాచ్ 8 మోడల్ కంటే కేవలం రూ. 3,500 ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే, ఆపిల్ వాచ్ 8 మోడల్‌పై ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,500 వరకు అదనపు తగ్గింపు కూడా అందుకోవచ్చు.
వివరాలు
ఆపిల్ వాచ్ SE 2 (GPS, 40mm)
తక్కువ బడ్జెట్ కలిగిన కొనుగోలుదారులకు ఆపిల్ వాచ్ SE 2 (GPS, 40mm) మంచి ఆప్షన్. అమెజాన్‌లో ఈ మోడల్ రూ. 19,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.
ఈ వాచ్ అసలు ధర రూ. 29,900 నుంచి తగ్గింది, అంటే వినియోగదారులు ఈ సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ SE మోడల్‌పై రూ. 9,901 తగ్గింపు పొందవచ్చు.