
WWDC 2025: యాపిల్ watchOS 26 ఆవిష్కరణ.. లిక్విడ్ గ్లాస్ డిజైన్, జెస్టర్ కంట్రోల్స్ వంటి అధునాతన ఫీచర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం ఆపిల్, వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) సందర్భంగా తన స్మార్ట్‌వాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క తాజా వెర్షన్ 'watchOS 26'ను అధికారికంగా ప్రకటించింది. కొత్త వర్షన్‌లో లిక్విడ్ గ్లాస్ డిజైన్, జెస్టర్ కంట్రోల్స్, AI ఆధారిత వర్కౌట్ బడీ, ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేషన్ వంటి సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. లిక్విడ్ గ్లాస్ డిజైన్ - మరింత స్టైలిష్‌గా iOS, iPadOS లతో పాటు ఇప్పుడు watchOSలో కూడా Liquid Glass డిజైన్ ప్రవేశపెట్టారు. ఇది విడ్జెట్లు, నోటిఫికేషన్లు, కంట్రోల్ సెంటర్, యాప్ కంట్రోల్స్‌పై పారదర్శకతను తీసుకురానుంది. ముఖ్యంగా Photos Watch Faceలో చూపే నంబర్లు ఇప్పుడు ఫోటోను దెబ్బతీయకుండా సాఫ్ట్‌గా కనిపిస్తాయి.
Details
AI బేస్డ్ వర్కౌట్ బడీ - మీ వ్యక్తిగత ఫిట్‌నెస్ మోటివేటర్
కొత్తగా ప్రవేశపెట్టిన Workout Buddy అనే AI ఫీచర్ వర్కౌట్ సమయంలో వ్యక్తిగత సలహాలు, మోటివేషన్, లక్ష్యాలపై పురోగతిని గుర్తుచేయడం వంటి సదుపాయాలు ఇస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లిష్ భాషలోనే అందుబాటులో ఉంటుంది. workout app డిజైన్‌ను కూడా కొత్తగా మార్చారు. మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ చేయడానికి, వర్కౌట్స్ కస్టమైజ్ చేయడానికి కోనాల్లో కొత్త బటన్‌లు జోడించారు. జెస్టర్ కంట్రోల్స్ Apple Watch Series 9 లేదా తదుపరి మోడల్స్‌లో, wrist flick (చేతిని తిప్పడం) ద్వారా నోటిఫికేషన్లు లేదా కాల్స్‌ను డిస్మిస్ చేయవచ్చు. అంతేకాదు, చుట్టూ ఉన్న ambient noiseను గుర్తించి, నోటిఫికేషన్లు, కాల్స్ వాల్యూమ్‌ను ఆటోమేటిక్‌గా తగ్గించే ఫీచర్‌ను కూడా watchOS 26 పరిచయం చేసింది.
Details
మెసేజ్‌లో తక్షణ అనువాదం & స్మార్ట్ రిప్లైలు
Series 9 మోడల్, Apple Intelligence కలిగిన iPhone కలిగి ఉంటే Messages యాప్‌లో తక్షణంగా అనువాదం చేయగలరు. ఇది అనేక భాషల్ని సపోర్ట్ చేస్తుంది. వర్షన్ నంబర్లో మార్పు గతేడాది విడుదలైన watchOS 11 తర్వాత, యాపిల్ నేరుగా watchOS 26లోకి అడుగుపెట్టింది. ఇతర ప్లాట్‌ఫాంలతో (iOS 26, iPadOS 26) సమానంగా ఉండేందుకు ఈ పేరును మార్పు చేసింది.