LOADING...
Apple: మాక్ స్క్రీన్‌ను స్మార్ట్ రింగ్ లైట్‌గా మార్చే ఆపిల్ కొత్త ఫీచర్
మాక్ స్క్రీన్‌ను స్మార్ట్ రింగ్ లైట్‌గా మార్చే ఆపిల్ కొత్త ఫీచర్

Apple: మాక్ స్క్రీన్‌ను స్మార్ట్ రింగ్ లైట్‌గా మార్చే ఆపిల్ కొత్త ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ తాజాగా విడుదల చేసిన macOS Tahoe 26.2 అప్‌డేట్‌లో 'ఎడ్జ్ లైట్' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో మాక్ స్క్రీన్‌నే ఒక వర్చువల్ రింగ్ లైట్‌లా మార్చి, తక్కువ వెలుతురు ఉన్న చోట్ల కూడా వీడియో కాల్స్‌లో ముఖం స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా రాత్రివేళలు లేదా లైటింగ్ సరిగా లేని గదుల్లో వీడియో కాల్స్ చేసే వారికి ఇది చాలా ఉపయోగపడనుంది. ఈ ఎడ్జ్ లైట్ ఫీచర్ అన్ని ఆపిల్ సిలికాన్ మాక్‌లకు అనుకూలంగా ఉంటుంది. యూజర్లు తమ అవసరాన్ని బట్టి స్క్రీన్ వెలుతురు తీవ్రత(బ్రైట్‌నెస్),వెచ్చదనం(వార్మ్ టోన్) లాంటివి మార్చుకునే అవకాశం ఉంది. గది వాతావరణాన్ని బట్టి లైటింగ్‌ను సర్దుబాటు చేసుకునేలా ఈ ఫీచర్ రూపొందించారు.

వివరాలు 

వీడియో కాల్స్‌కు సహజంగా కలిసిపోయే కొత్త టెక్నాలజీ

ఇప్పటికే macOS‌లో ఉన్న స్టూడియో లైట్, పోర్ట్రైట్ మోడ్, వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్స్, వాయిస్ ఐసోలేషన్ వంటి వీడియో కాలింగ్ ఫీచర్లకు ఎడ్జ్ లైట్ మరో అదనంగా చేరింది. ఇది ఫేస్‌టైమ్, జూమ్ వంటి వివిధ వీడియో కాలింగ్ యాప్‌లలో సజావుగా పనిచేస్తుంది. 2024 తర్వాత విడుదలైన మాక్ మోడళ్లలో అయితే, వీడియో కాల్ సమయంలో లైటింగ్ తక్కువగా ఉందని గుర్తిస్తే, ఎడ్జ్ లైట్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది.

వివరాలు 

ఎడ్జ్ లైట్ తెలివైన పనితీరు 

ఎడ్జ్ లైట్ ఫీచర్ ఆపిల్ న్యూరల్ ఇంజిన్‌ను ఉపయోగించి కెమెరాలో కనిపించే ముఖాన్ని గుర్తిస్తుంది. మరో ప్రత్యేక చిప్ గది లైటింగ్ పరిస్థితులను విశ్లేషిస్తుంది. ఈ రెండూ కలిసి స్క్రీన్ వెలుతురును సరైన స్థాయిలో సర్దుబాటు చేసి, చీకటి గదుల్లో కూడా ముఖం స్పష్టంగా, సహజంగా కనిపించేలా చేస్తాయి. ఈ ఫీచర్ తాజా macOS అప్‌డేట్‌లో భాగంగా ఉండగా, ఈ ఏడాది చివర్లో యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Advertisement