
Arattai App: వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 'అరట్టై'.. ట్రెండింగ్‌లోకి యాప్!
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైకు చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన 'అరట్టై' యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హిట్‌గా మారింది. యాపిల్ యాప్ స్టోర్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తమిళంలో 'అరట్టై' అంటే 'మాట్లాడటం' అని అర్థం. ఈ యాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్, వీడియో కాల్స్, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపడం, స్టోరీస్, ఛానల్స్ క్రియేట్ చేయడం వంటి వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాలకు తగిన ఫీచర్లను అందించబడింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న పిలుపు మేరకు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, అశ్వినీ వైష్ణవ్ యాప్‌ను ప్రోత్సహిస్తున్నారు.
Details
గోప్యతపై ఆందోళనలు
ఇటీవల అశ్వినీ వైష్ణవ్ కూడా తమ కేబినెట్ ప్రజెంటేషన్ల కోసం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కాకుండా జోహో ఆధారిత 'అరట్టై యాప్'ను ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా ప్రజలకు యాప్ వాడాలని సిఫార్సు చేశారు.కానీ ప్రస్తుతం యాప్‌లో కేవలం కాల్స్‌కు మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. మెసేజ్‌లకు ఈ సౌకర్యం లేని కారణంగా గోప్యతపై కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. థర్డ్ పార్టీలు మెసేజ్‌లను చూడగలిగే అవకాశం ఉండటం,వాట్సాప్ వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌కు సమానంగా నిలవాలంటే ఈ లోటును భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఆదరణ పొందుతున్న 'అరట్టై', తరచూ అప్‌డేట్‌లు చేసి కొత్త ఫీచర్లు చేర్చితే వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.