
భూమికి కొత్త సహచరుడు... మరో కొత్త చంద్రుడి గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
నింగికి, నేలకి కేవలం సూర్య, చంద్రులే అని అంటే ఇకపై ఆ మాట చెల్లబోదేమో. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఓ కొత్త చంద్రుడిని గుర్తించారు.
ఇటీవలే జరిగిన ఓ సైంటిఫిక్ రీసెర్చ్ లో శాస్త్రవేత్తలకు ఓ కొత్త ఖగోళ సహచరుడు కనిపించాడు.
2023 ఎఫ్‌డబ్ల్యు13గా పేర్కొంటున్న క్వాసి-మూన్‌ను హవాయిలోని పాన్-స్టార్స్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. ఖగోళ పరిభాషలో దీన్నే క్వాసి-మూన్ అని అంటారు.
ఇవి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తితో పుడమి చుట్టూనే పరిభ్రమిస్తాయి. వీరినే క్వాసి మూన్స్ (పాక్షిక - చంద్రులని) క్వాసి శాటిలైట్స్ అని కూడా పిలుస్తారు.
ఇవి చంద్రుడ్ని పోలి ఉండే కక్ష్యలను కలిగి ఉంటాయి. కానీ భూమికి కాకుండా సూర్యుడి గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటాయి.
క్వాసి మూన్స్
హిల్ స్పియర్ వద్ద మరో చంద్రుడు
2023 FW13 భూమి గురుత్వాకర్షణ ప్రభావానికి మించి కక్ష్యలో ఉంది. ఇది హిల్ స్పియర్ అనే ఖగోళం చుట్టూ ఉన్న ప్రాంతం వద్ద ఉంది.
ఇక్కడ ఉపగ్రహాలను ఆకర్షించడంలో దాని గురుత్వాకర్షణ శక్తి ఆధిపత్యం చెలాయిస్తుంది.
భూమి హిల్ స్పియర్ కి 932,000 మైళ్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంది. 2023 FW13 సుమారు 1.6 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది.