
Bacteria produce gold:విషపూరిత లోహాలను తిని 24 క్యారెట్ల బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియా
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధర రోజురోజుకూ పెరిగి మనల్ని ఇబ్బందిపెడుతుంటే, మరోవైపు విషపూరిత లోహాలను తిని 24 క్యారెట్ల శుద్ధమైన బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాకు పేరు 'కుప్రియోవిడస్ మెటాలీడ్యూరన్స్'. శాస్త్రవేత్తలు దీన్ని సరదాగా 'గోల్డ్ పూపింగ్ బ్యాక్టీరియా' అని పిలుస్తున్నారు. రాగి, ఇతర లోహాలు కలిసిన బంగారం లేదా నికెల్ వంటి పదార్థాలను ఇది తినగానే, తన జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అయ్యే ప్రత్యేక ఎంజైముల సాయంతో వాటిని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా మార్చి విసర్జిస్తుంది.
వివరాలు
కంటికి కనిపించని నానోపార్టికల్ పరిమాణంలో బంగారం
ఇది విన్న వెంటనే ఈ బ్యాక్టీరియాను పెంచుకుని బంగారం సంపాదించుకోవచ్చేమో అనిపించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే.. ఇది ఉత్పత్తి చేసే బంగారం కంటికి కనిపించని నానోపార్టికల్ పరిమాణంలో ఉంటుంది. అయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. బంగారు గనుల ప్రాంతాల్లో భారలోహాలతో కలుషితమైన నేలను శుభ్రపరచడానికి, 'బయో మైనింగ్' పద్ధతిలో ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి భూమి కాలుష్యాన్ని తగ్గించాలనే ఆలోచనలో శాస్త్రవేత్తలు ఉన్నారని తెలుస్తోంది.