LOADING...
Meta AI glasses: మెటా AI గ్లాసెస్ వివాదం.. బ్యాంక్ డేటా నుంచి బెడ్‌రూమ్ సీన్స్ వరకూ రికార్డ్?
మెటా AI గ్లాసెస్ వివాదం.. బ్యాంక్ డేటా నుంచి బెడ్‌రూమ్ సీన్స్ వరకూ రికార్డ్?

Meta AI glasses: మెటా AI గ్లాసెస్ వివాదం.. బ్యాంక్ డేటా నుంచి బెడ్‌రూమ్ సీన్స్ వరకూ రికార్డ్?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెక్ దిగ్గజం మెటా మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. మార్క్ జూకర్‌బర్గ్ (Mark Zuckerberg) స్థాపించిన ఈ సంస్థ 2025 సెప్టెంబర్‌లో కొత్త AI స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రియల్ టైమ్ అనువాదం,ఫేషియల్ రికగ్నిషన్ వంటి సదుపాయాలతో వచ్చిన ఈ గ్లాసెస్‌పై తాజాగా గోప్యతా వివాదం చెలరేగింది. స్వీడన్‌కు చెందిన Svenska Dagbladet, Goteborgs-Posten చేసిన విచారణలో ఈ గ్లాసెస్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిరంతరం మెటా సర్వర్లకు పంపిస్తున్నట్లు బయటపడింది. బ్యాంక్ వివరాలు నుంచి పడకగది సన్నివేశాల వరకూ సున్నితమైన వీడియోలు సిస్టమ్‌లోకి వెళ్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

వివరాలు 

Sama సంస్థలో వేలాది మంది డేటా అనోటేటర్లు

ఈ గ్లాసెస్ అభివృద్ధి కేవలం సిలికాన్ వ్యాలీ వరకే పరిమితం కాలేదని తెలుస్తోంది. కెన్యాలోని నైరోబీలో మెటాకు సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న Sama సంస్థలో వేలాది మంది డేటా అనోటేటర్లు పని చేస్తున్నారు. గ్లాసెస్ ద్వారా రికార్డ్ అయిన వీడియోలను వీరు పరిశీలించి, అందులో కనిపించే వస్తువులు, దృశ్యాలను గుర్తించి ట్యాగ్ చేస్తున్నారు. కార్లు, లైట్లు, రోడ్లు ఇలా ప్రతిదానికీ లేబుల్స్ జోడిస్తూ AIకి శిక్షణ ఇస్తున్నారు.

వివరాలు 

గోప్యతాహక్కులపై పెద్ద చర్చ

అయితే,ఈప్రక్రియలో అనోటేటర్లకు వ్యక్తిగత దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. కొందరి బాత్రూమ్ వినియోగం,మరికొందరి వ్యక్తిగత క్షణాలు కూడా వీడియోల్లో ఉన్నాయని వెల్లడించారు. ఇది గోప్యతాహక్కులపై పెద్ద చర్చకు దారితీసింది."ఇలాంటి వీడియోలు చూస్తే అసౌకర్యంగా ఉంటుంది.కానీ ఇది ఉద్యోగం కాబట్టి చేయాల్సిందే"అని ఓ ఉద్యోగి పేర్కొన్నాడు. వివాదాల మధ్యా ఈగ్లాసెస్ అమ్మకాలు మాత్రం భారీగా పెరిగాయి. 2025లోనే మెటా రే-బాన్ గ్లాసెస్ అమ్మకాలు మూడు రెట్లు పెరిగి సుమారు 70లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. అయితే వినియోగదారుల డేటా ఎలా ప్రాసెస్ అవుతోంది అన్న విషయంలో స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది సేల్స్ ప్రతినిధులు"డేటా షేర్ చేయాలా వద్దా అన్నది యూజర్ ఎంపిక"అంటుంటే, మరికొందరికి డేటా ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదని చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

సున్నితమైన విషయాలు షేర్ చేయవద్దని మెటా హెచ్చరిక 

పత్రికా ప్రతినిధులు స్వయంగా గ్లాసెస్ కొనుగోలు చేసి పరీక్షించగా, వాటిని ఉపయోగించాలంటే తప్పనిసరిగా "మెటా AI" యాప్‌తో కనెక్ట్ కావాల్సి వస్తోందని గుర్తించారు. ఇంటర్నెట్ లేకుండా ఉపయోగించాలంటే గ్లాసెస్ పనిచేయలేదని తెలిపారు. వాడుతున్నంతసేపూ మెటా సర్వర్లకు డేటా పింగ్స్ వెళ్లినట్లు గమనించారు. మెటా నిబంధనల ప్రకారం, కొన్నిసార్లు యూజర్ల AI సంభాషణలను మానవులు లేదా ఆటోమేటెడ్ సిస్టమ్స్ పరిశీలించవచ్చని స్పష్టం చేసింది. సున్నితమైన విషయాలు షేర్ చేయవద్దని కూడా హెచ్చరించింది. అంటే, యూజర్‌కు తెలియకుండానే వారి వ్యక్తిగత సమాచారం శిక్షణ కోసం వాడే అవకాశం ఉందన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

Advertisement

వివరాలు 

స్మార్ట్ టెక్నాలజీ పేరుతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు పెరుగుతోందా?

యూరోపియన్ యూనియన్‌లో మెటా సేవలు అందిస్తున్నందున అక్కడి General Data Protection Regulation (GDPR) చట్టం వర్తిస్తుంది. డేటా ఎలా వాడుతున్నారో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత సంస్థపై ఉంది. "ఈ గ్లాసెస్ విషయంలో పారదర్శకత లోపిస్తోంది. AI శిక్షణ కోసం డేటా వాడాలంటే స్పష్టమైన అనుమతి తీసుకోవాలి" అని Kleanthi Sardeli, None Of Your Business సంస్థకు చెందిన డేటా రక్షణ న్యాయవాది అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే... స్మార్ట్ టెక్నాలజీ పేరుతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు పెరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది.

Advertisement