Page Loader
డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు
మార్క్ జుకర్‌బర్గ్ రూపొందిస్తున్న డీ సెంట్రలైజ్డ్ టెక్స్ట్ యాప్‌ 'P92'

డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 11, 2023
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

''డీ సెంట్రలైజ్డ్ సోషల్ నెట్‌వర్క్' సోషల్ మీడియా బిలియనీర్లను ఆకట్టుకుంటుంది. ఈ లిస్ట్ లో జాక్ డోర్సే, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఇటువంటి సామాజిక నెట్‌వర్క్‌లు కొత్త కాదు. ఇటువంటి మొదటి సామాజిక నెట్‌వర్క్‌ డయాస్పోరా, 2010లో ప్రారంభమైంది. గత కొంత కాలంగా అవి ఉన్నప్పటికి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఆన్‌లైన్ ప్రపంచంలో సెంట్రలైజ్డ్ సామాజిక నెట్‌వర్క్‌లు ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. బిలియనీర్లు ఈ ప్రయోగాలు చేయడానికి ముందు, ఇటువంటి సోషల్ నెట్‌వర్క్‌లు ఎందుకు అవసరమో తెలుసుకుందాం. ఇటువంటి నెట్‌వర్క్‌ల క్రింద ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వస్తాయి. సెంట్రలైజ్డ్ సోషల్ మీడియా యాప్‌ల వలన అల్గారిథమిక్ ద్వారా కంటెంట్‌ను బలవంతంగా అందించడం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

ఫోన్

మార్క్ జుకర్‌బర్గ్ రూపొందిస్తున్న డీ సెంట్రలైజ్డ్ టెక్స్ట్-ఆధారిత యాప్‌ 'P92'

ఇటువంటి సోషల్ నెట్‌వర్క్‌ల వలన అధిక నియంత్రణ, క్యూరేషన్‌ను పరిష్కరించడానికి డీ సెంట్రలైజ్డ్ సామాజిక నెట్‌వర్క్‌లు వెలుగులోకి వచ్చాయి. ప్రజాదరణ పొందిన డీ సెంట్రలైజ్డ్ సోషల్ నెట్‌వర్క్ మాస్టోడన్, ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ట్రెండ్ అయింది. దీనికి సెంట్రలైజ్డ్ సర్వర్ లేదు. దానికి బదులుగా, ఇంటర్ కనెక్టడ్ సర్వర్లు ఉన్నాయి. ఇది ActivityPub ప్రోటోకాల్‌కు సపోర్ట్ ఇచ్చే సర్వర్‌ల సమూహం Fediverseలో కూడా భాగం. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని కంపెనీ రూపొందిస్తున్న డీ సెంట్రలైజ్డ్ టెక్స్ట్-ఆధారిత యాప్‌కి 'P92' అని పెట్టారు. ఇది ఒక స్వతంత్ర డీ సెంట్రలైజ్డ్ సోషల్ నెట్‌వర్క్ అవుతుంది, ఇక్కడ వినియోగదారులు మాస్టోడాన్ వంటి టెక్స్ట్ అప్‌డేట్‌లను చేయచ్చు.