LOADING...
Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానాల్లో దీన్ని ఎందుకు అమర్చుతారు?  
బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానాల్లో దీన్ని ఎందుకు అమర్చుతారు?

Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానాల్లో దీన్ని ఎందుకు అమర్చుతారు?  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ క్రాష్‌లు జరిగినప్పుడు సాధారణంగా మనం వింటూ ఉండే పేరు బ్లాక్ బాక్స్. ఏ కారణంతో ప్రమాదం జరిగింది? ప్రమాద సమయానికి ముందు ఏం జరిగింది? వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి నిపుణులు తొలుత వెతుకునేది ఈ బ్లాక్ బాక్సే. ఎందుకంటే ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు జరిగిన సంభాషణలు, విమానం సాంకేతిక వివరాలన్నీ ఈ పరికరంలో నిక్షిప్తిమై ఉంటాయి. అందువల్లనే ప్రమాదానంతర దర్యాప్తులో ఇది అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. దీనిని తయారుచేసే విధానం నుంచి, విమానంలో ఎక్కడ అమర్చాలి అనే విషయాల వరకు ప్రతీ దశలోనూ అధిక జాగ్రత్తలు తీసుకుంటారు.

వివరాలు 

టైటానియంతో తయారు చేసే బ్లాక్ బాక్స్

బ్లాక్ బాక్స్ అనేది విమానాలు,హెలికాప్టర్లు,ఇతర ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సాధారణంగా ఉండే పరికరం. దీనిని "ఫ్లైట్ డేటా రికార్డర్" అని కూడా పిలుస్తారు. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో జరిగే ప్రతీ చిన్న కార్యకలాపాన్ని ఇది రికార్డు చేస్తుంది. ప్రమాదం సంభవించిన తర్వాత ఈ రికార్డుల ఆధారంగానే అసలు కారణాలు బయటపడతాయి. భద్రత దృష్ట్యా దీనిని సాధారణంగా విమానపు వెనుక భాగంలో అమర్చడం జరుగుతుంది. బ్లాక్ బాక్స్ తయారీలో ముఖ్యంగా టైటానియం లాంటి అతి బలమైన లోహాన్ని ఉపయోగిస్తారు. ఇది ఎత్తైన ప్రాంతం నుంచి నేలపై పడినా లేదా నీటిలో పడినా, దీని లోపల ఉన్న సమాచారం దెబ్బతినకుండా ఉండేలా రూపొందించబడుతుంది.

వివరాలు 

విమాన భద్రతా పరిశోధనల్లో బ్లాక్ బాక్స్ కీలకం

విద్యుత్ సరఫరా లేకపోయినా ఇది సుమారు 30 రోజుల పాటు పని చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతే కాదు, ఇది దాదాపు 11000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. ప్రమాదంలో బ్లాక్ బాక్స్ ఎక్కడ పడిపోయిందో తెలుసుకోవడం కూడా ఓ సవాలే. ఇందుకోసం ఇది నిరంతరం "బీప్" శబ్ధాన్ని,తరంగాలను ఉద్గరిస్తూ ఉంటుంది. ఈ శబ్ధాలను పరిశోధకులు సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం నుంచి వినగలరు. అంతేకాదు, ఇది సముద్రంలో 14,000 అడుగుల లోతు నుంచీ కూడా తన సంకేతాలను వెలువరించగలదు. ఈ ప్రత్యేకతలే దీన్ని విమాన భద్రతా పరిశోధనల్లో కీలకంగా మారుస్తున్నాయి.