LOADING...
Block-2 BlueBird: బ్లాక్-2 బ్లూబర్డ్ అంటే ఏమిటి? అమెరికా భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
బ్లాక్-2 బ్లూబర్డ్ అంటే ఏమిటి? అమెరికా భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Block-2 BlueBird: బ్లాక్-2 బ్లూబర్డ్ అంటే ఏమిటి? అమెరికా భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్,అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలు అయిన ఇస్రో, నాసా కలిసి నిసార్ ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశాయి. ఈ విజయంతో ఇరు దేశాలు అంతరిక్ష సహకారంలో మరో ముందగుడు వేయబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ చెప్పారు. అమెరికా తయారీ 6,500 కిలోల బరువున్న కమ్యూనికేషన్ శాటిలైట్‌ను మరికొద్ది నెలలలో ఇస్రో ప్రయోగించనున్నది. ఇక అంతరిక్ష శాఖ కార్యదర్శిగా ఉన్న నారాయణన్‌ చెన్నైలోని ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నారాయణన్, 1963లో ఇస్రో స్థాపించినప్పుడు అమెరికా ఒక చిన్న రాకెట్‌ను విరాళంగా ఇచ్చిందని గుర్తుచేశారు.

వివరాలు 

 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలు 

1975లో అమెరికా ఇచ్చిన ఉపగ్రహ డేటా ఆధారంగా దేశంలోని 2,400 గ్రామాల్లోని 2,400 టీవీలకు ఇస్రో సిగ్నల్స్ అందించి సామూహిక సమాచార మార్పిడిని విజయవంతంగా నిర్వహించిందని వివరించారు. ప్రస్తుతం మన సొంత లాంఛర్లతో భారత్‌ అమెరికా ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నందున ఇది అంతరిక్ష రంగంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని నారాయణన్ పేర్కొన్నారు. 50 సంవత్సరాల క్రితం శాటిలైట్ సాంకేతికత లేని ఒక దేశంగా ఉన్న భారత్, ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను తన సొంత రాకెట్ల ద్వారా ప్రయోగించినట్లు ఆయన ప్రశంసించారు.