LOADING...
Booking.com: సైబర్ దాడికి గురైన Booking.com.. కస్టమర్ల సమాచారం లీక్
సైబర్ దాడికి గురైన Booking.com.. కస్టమర్ల సమాచారం లీక్

Booking.com: సైబర్ దాడికి గురైన Booking.com.. కస్టమర్ల సమాచారం లీక్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్స్‌కు ప్రసిద్ధి చెందిన Booking.comలో భారీ డేటా లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది. అనధికార వ్యక్తులు కస్టమర్ల బుకింగ్ వివరాలను యాక్సెస్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమస్యను అదుపులోకి తీసుకున్నామని, ప్రభావిత రిజర్వేషన్లకు సంబంధించిన పిన్ నంబర్లు మార్చి, కస్టమర్లకు సమాచారం అందించామని తెలిపింది. అయితే ఈ హ్యాక్ వల్ల ఎంత మంది ప్రభావితమయ్యారో మాత్రం సంస్థ వెల్లడించలేదు. ముఖ్యంగా ఆర్థిక వివరాలు వంటివి లీక్ కాలేదని స్పష్టం చేసింది.

వివరాలు 

2018లో ఫిషింగ్ ద్వారా వేలాది మంది డేటా చోరీ 

కంపెనీ పంపిన మెయిల్ ప్రకారం, హ్యాకర్లు గతంలో చేసిన బుకింగ్స్‌కు సంబంధించిన వివరాలు, పేర్లు, ఈమెయిల్స్, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, అలాగే హోటల్‌కు షేర్ చేసిన సమాచారం వరకు యాక్సెస్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఆన్‌లైన్ మోసాలు పెరిగిన నేపథ్యంలో, ముందుగా చెల్లింపుల వివరాలు అడిగి భారీ మొత్తాలు వసూలు చేసే ఘటనలు కూడా నమోదయ్యాయి. గతంలో 2018లో కూడా ఫిషింగ్ ద్వారా వేలాది మంది డేటా దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది.

వివరాలు 

కంపెనీకి భారీ జరిమానా

ఈ డేటా లీక్ విషయాన్ని నెదర్లాండ్స్ ప్రైవసీ రెగ్యులేటర్‌కు ఆలస్యంగా తెలియజేసినందుకు కంపెనీకి భారీ జరిమానా విధించారు. ఇదే సమయంలో బుకింగ్ వెబ్‌సైట్లలో నకిలీ లిస్టింగ్స్ పెరుగుతున్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అమెరికాకు చెందిన Booking Holdingsకు చెందిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రయాణికులను హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, అనుభవాలతో కనెక్ట్ చేస్తోంది.

Advertisement