Page Loader
BSNL: కొత్త లోగోను ఆవిష్కరించిన BSNL.. స్పామ్ బ్లాకింగ్ సొల్యూషన్‌తో సహా 7 కొత్త సేవలు 
కొత్త లోగోను ఆవిష్కరించిన BSNL.. స్పామ్ బ్లాకింగ్ సొల్యూషన్‌తో సహా 7 కొత్త సేవలు

BSNL: కొత్త లోగోను ఆవిష్కరించిన BSNL.. స్పామ్ బ్లాకింగ్ సొల్యూషన్‌తో సహా 7 కొత్త సేవలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు శుభవార్త. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో, కొత్త లోగోను కూడా అవిష్కరించింది. మంగళవారం (అక్టోబర్ 22) బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ఏడు ఫీచర్లను ప్రారంభించింది. ఇప్పటికే, బీఎస్‌ఎన్‌ఎల్ దేశంలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 4జీ సేవలను అందిస్తోంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనేక కొత్త ఫీచర్లు పరిచయం చేయబోతుంది. ఇందులో భాగంగా, అన్ వాంటెడ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు స్పామ్-ఫ్రీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, స్పామ్-ఫ్రీ నెట్‌వర్క్, వై-ఫై రోమింగ్, డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీ వంటి ఏడు కొత్త BSNL సేవలను ప్రారంభించారు.

వివరాలు 

దేశంలో మొట్టమొదటి డైరెక్ట్ టు డివైజ్

ఈ క్రమంలో, బీఎస్‌ఎన్‌ఎల్ 500కి పైగా లైవ్ ఛానెల్స్, పేటీవీ ఆప్షన్లతో ఫైబర్ టీవీ సర్వీస్‌ను ప్రకటించింది. ఇది ఫైబర్ ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్లకు అదనపు ఖర్చు లేకుండా అందించబోతుంది. అంతేకాకుండా, కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి ఆటోమేటెడ్ కియోస్క్‌లను పరిచయం చేస్తోంది. దేశంలో మొట్టమొదటి డైరెక్ట్ టు డివైజ్ (D2D) కనెక్టివిటీ సొల్యూషన్‌ను కూడా ప్రారంభించింది, ఇది శాటిలైట్, మొబైల్ నెట్‌వర్క్‌లను కలుపుతుంది. ఈ కొత్త సేవలు అత్యవసర పరిస్థితుల్లో, మారుమూల ప్రాంతాల్లో కీలకమైన పరిష్కారం అవ్వబోతున్నాయి. సాధారణ కనెక్టివిటీ లేని ప్రదేశాల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ చేయడం సాధ్యం అవుతుంది.