Loading...
OpenAI lawsuit: OpenAIపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ కేసు.. అసలేం జరిగింది?
OpenAIపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ కేసు.. అసలేం జరిగింది?

OpenAI lawsuit: OpenAIపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ కేసు.. అసలేం జరిగింది?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 17, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ కార్యాలయం దావా వేసింది. AI ఏజెంట్లను పరీక్షించే సమయంలో కంపెనీ పాటించిన భద్రతా విధానాలు సరిపోలేదని, వాటి వల్ల ప్రజలకు సైబర్‌ భద్రతా ముప్పు ఏర్పడుతోందని ఆరోపించింది. ఈ కేసుకు ప్రధాన కారణంగా 2026 జూలైలో జరిగిన Hugging Face ఘటనను అధికారులు ప్రస్తావించారు. OpenAIకి చెందిన ప్రీ-రిలీజ్‌ AI మోడల్‌ ఓ ట్రైనింగ్‌ బెంచ్‌మార్క్‌ పూర్తి చేసే క్రమంలో Hugging Face, OpenAI భద్రతా వ్యవస్థల్లోకి చొరబడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Details

ఒక్క ఘటనతోనే కాదు.. మరిన్ని కేసులు

ఈ వ్యవహారాన్ని OpenAI మాత్రం సాధారణ పరిస్థితుల్లో జరిగే ఘటనగా చూడలేదు. తమ అధికారిక నివేదికలో దీనిని అరుదైన పరిస్థితుల కలయికతో జరిగిన అనూహ్య ఘటనగా పేర్కొంది.

అయితే కాలిఫోర్నియా అధికారులు మాత్రం ఇది ఒక్కసారితో ఆగిపోయిన సమస్య కాదని చెబుతున్నారు.

RubyGems, DseWiki, Wikimedia Foundationతో పాటు ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్లకు సంబంధించిన కొన్ని ఘటనలను కూడా తమ ఫిర్యాదులో ప్రస్తావించారు.

దీంతో AI ఏజెంట్ల ప్రవర్తనపై మరోసారి భద్రతా చర్చ మొదలైంది.

Details

సున్నితమైన సమాచారం బయటపడిందా?

కాలిఫోర్నియా దాఖలు చేసిన పిటిషన్‌లో మరింత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. OpenAI ఏజెంట్లు చొరబడినట్లు గుర్తించిన డజన్ల కొద్దీ సంస్థలకు కంపెనీ నోటీసులు పంపినట్లు అందులో పేర్కొన్నారు.

కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని AI ఏజెంట్లు యాక్సెస్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయితే ఈ ఘటనల్లో చాలా వరకు బహిరంగంగా వెల్లడించలేదని అధికారులు పేర్కొన్నారు.

ADVERTISEMENT

Details

కోర్టు నిర్ణయం కీలకం

OpenAI భద్రతా నియంత్రణలు లేకుండా AIని పరీక్షించడం ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితిగా మారిందనేది కాలిఫోర్నియా AG ప్రధాన వాదన.

అలాగే సురక్షితం కాని ఉత్పత్తిని మార్కెట్‌ చేయడం ద్వారా అన్యాయ పోటీకి పాల్పడిందనే మరో ఆరోపణను కూడా చేసింది. కేసులో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ రాబ్ బొంటా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని చెప్పారు.

మరోవైపు OpenAI మాత్రం AI రంగంలోని ఇతర సంస్థలకూ ఇలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయని, ఘటన తర్వాత తమ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేశామని తెలిపింది.

ADVERTISEMENT