Loading...
Earth survive: 9 క్వాడ్రిలియన్ ఏళ్ల పాటు మానవాళిని కాపాడేది అదే..భూమికి నిజంగా అలా జరుగుతుందా?
9 క్వాడ్రిలియన్ ఏళ్ల పాటు మానవాళిని కాపాడేది అదే..భూమికి నిజంగా అలా జరుగుతుందా?

Earth survive: 9 క్వాడ్రిలియన్ ఏళ్ల పాటు మానవాళిని కాపాడేది అదే..భూమికి నిజంగా అలా జరుగుతుందా?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 07, 2026
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

భవిష్యత్తులో కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు తన జీవిత చక్రంలోని చివరి దశలకు చేరుకుంటాడని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో సూర్యుడు విపరీతంగా విస్తరించి 'రెడ్ జెయింట్'గా మారతాడు. ఈ పరిణామంలో బుధుడు, శుక్రుడు పూర్తిగా సూర్యుడిలో కలిసిపోయే అవకాశం ఉంది. భూమి, అంగారక గ్రహాల పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా గురుడు సహా ఆ తర్వాతి వాయు గ్రహాల వాతావరణాలు, కక్ష్యలపైనా సూర్యుడి విస్తరణ ప్రభావం చూపుతుంది.

వివరాలు

భూమిని కాపాడే మార్గం ఏది?

అంతరిక్ష విపత్తు నుంచి భూమిని కాపాడే మార్గం ఉండొచ్చని ఓ స్వతంత్ర పరిశోధకుడు చెబుతున్నారు.

సూర్యుడు తన జీవితాన్ని ముగించుకునే దశలో ఉన్నప్పటికీ భూమిని సురక్షితంగా ఉంచడం సాధ్యమేనని ఆయన త్వరలో ప్రచురితం కానున్న ఓ అధ్యయనంలో ప్రతిపాదించారు.

స్వతంత్ర పరిశోధకుడు గాబ్రియేల్ హ్యారీ రూపొందించిన ఈ ప్రతిపాదన ప్రకారం.. సూర్యుడి ఇంధనం అయిపోయిన తర్వాత కూడా భూమిపై జీవం కొనసాగించవచ్చని చెబుతున్నారు.

సూర్యుడు మరో బిలియన్ సంవత్సరాల్లో తన ఇంధనాన్ని కోల్పోవడం ప్రారంభించి, దాదాపు 5 బిలియన్ సంవత్సరాల తర్వాత కుంచించుకుపోయి ప్రకాశించే వాయు వలయంలా మారే పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ.. తగిన రక్షణ చర్యలతో భూమిని ఏకంగా 9 క్వాడ్రిలియన్ సంవత్సరాల వరకు నివాసయోగ్యంగా ఉంచవచ్చని ఆయన అంచనా వేశారు.

వివరాలు

భూమిని కాపాడేందుకు రక్షణ వ్యవస్థ..

ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ది బ్రిటిష్ ఇంటర్‌ప్లానెటరీ సొసైటీలో ప్రచురితం కానుంది.

ఇందులో 'మెగా ఇంజినీరింగ్' ద్వారా భూమిని సూర్యుడి ప్రభావం నుంచి మాత్రమే కాకుండా మరికొన్ని భారీ ప్రమాదాల నుంచి కూడా రక్షించవచ్చని పేర్కొన్నారు.

భూగర్భ పలకల కదలికలు (టెక్టానిక్స్), నీటి నష్టం, భూమి వంపు (టిల్ట్), భ్రమణ వేగంలో మార్పులు, గ్రహశకలాలు లేదా ఇతర ఖగోళ వస్తువులతో ఢీకొనే ప్రమాదం, సౌర కుటుంబం వెలుపలి నుంచి వచ్చే ఇతర ముప్పుల నుంచి కూడా భూమిని కాపాడేందుకు ఈ రక్షణ వ్యవస్థలను ఉపయోగించవచ్చని ప్రతిపాదన చెబుతోంది.

ADVERTISEMENT

వివరాలు

మరో బిలియన్ సంవత్సరాల్లోనే భూమి నివాసయోగ్యం కాకపోవచ్చా?

ప్రస్తుత పరిస్థితుల్లో భూమి మరో బిలియన్ సంవత్సరాల తర్వాత నివాసయోగ్యతను కోల్పోయే అవకాశం ఉందని హ్యారీ పేర్కొన్నారు.

అయితే తాను ప్రతిపాదించిన రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం నిర్వహిస్తే భూమిని ఏకంగా 9.1 మిలియన్ బిలియన్ సంవత్సరాల పాటు నివాసయోగ్యంగా కొనసాగించవచ్చని ఆయన చెబుతున్నారు.

సూర్యుడు క్రమంగా విస్తరించడం ప్రారంభించినప్పుడు దాని నుంచి వెలువడే తీవ్రమైన వికిరణం భూమిపై ప్రభావం చూపకుండా అడ్డుకోవాల్సి ఉంటుంది.

ఇందుకోసం చంద్రుడి కక్ష్యకు వెలుపల, దాదాపు 7 లక్షల కిలోమీటర్ల వెడల్పుతో ఒక భారీ సన్‌షేడ్‌ (సౌర కవచం) ఏర్పాటు చేయాలని పరిశోధకుడు ప్రతిపాదించారు.

ఈ కవచం సూర్యుడి నుంచి వచ్చే వికిరణాన్ని అడ్డుకుని భూమిని రక్షించగలదని ఆయన భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

చంద్రుడి నుంచి అల్యూమినియం.. సెరెస్ నుంచి కార్బన్..

అంత భారీ సౌర కవచాన్ని నిర్దిష్ట స్థానంలో స్థిరంగా ఉంచేందుకు ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఉపయోగించవచ్చని ప్రతిపాదన చెబుతోంది.

ఇందుకోసం కార్బన్‌తో తయారు చేసిన కేబుల్‌ను ఉపయోగించి, దానిని లాగ్రాంజ్ పాయింట్-1 (L1) వద్ద ఉంచే బరువుకు అనుసంధానించవచ్చు.

ఈ కవచం తయారీలో అవసరమైన అల్యూమినియంను చంద్రుడి నుంచి తవ్వి సేకరించవచ్చని పరిశోధకుడు సూచించారు.

ఈ భారీ సన్‌షేడ్ ఆకాశంలోని దాదాపు 70 డిగ్రీల ప్రాంతాన్ని కప్పి ఉంచేలా రూపొందించవచ్చని పేర్కొన్నారు.

కవచాన్ని స్థిరంగా ఉంచే కార్బన్ టెథర్ దాదాపు 20 లక్షల కిలోమీటర్ల పొడవు ఉండాల్సి ఉంటుంది.

ఇందుకోసం మరుగుజ్జు గ్రహం సెరెస్ (Ceres)లోని దాదాపు 40 శాతం పదార్థాన్ని తవ్వి ఉపయోగించాల్సి ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది.

ADVERTISEMENT