Page Loader
Fake Financial Apps : ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక.. ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్త!
ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక.. ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్త!

Fake Financial Apps : ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక.. ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్త!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికను జారీ చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఫేక్ ఫైనాన్షియల్ యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఆర్థిక సమాచారాన్ని అనుమతి లేకుండా దొంగిలిస్తున్నాయని హెచ్చరించింది. ఈ లోన్ యాప్‌లు లీగల్ యాప్‌ల్లా కనిపించినా, వాస్తవానికి అవి మోసాలకు అడ్డాగా మారుతున్నాయని అధికారికంగా వెల్లడించింది. ఈ హెచ్చరికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ సైబర్ దోస్త్ ద్వారా జారీ చేశారు.

Details

విదేశీ మూలాలతో ఫేక్ యాప్‌లు

ఈ మోసపూరిత లోన్ యాప్‌ల వెనక విదేశీ సంస్థల ప్రమేయం ఎక్కువగా ఉందని గుర్తించిన అధికారాలు, ప్రజలను అధిక అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. ఈ యాప్‌లు యూజర్ల ఆర్థిక సమాచారాన్ని, ప్రైవసీని హానికరంగా ఉపయోగిస్తున్నాయనీ, వినియోగదారులకు డబ్బు, డేటా నష్టాలను కలిగిస్తున్నాయని స్పష్టం చేశారు.

Details

మోసపూరిత లోన్ యాప్‌ల జాబితా

ఇన్‌వాయిసర్ ఎక్స్‌పర్ట్స్ లోన్ రైనా - ఇన్‌స్టంట్ లోన్ ఆన్‌లైన్ గుప్తా క్రెడిట్ - సేఫ్ అండ్ హ్యాండీ గ్రానెట్‌స్విఫ్ట్ లోన్ క్యూ - ఫైనాన్షియల్ కాలిక్యులేటర్ క్రెడిట్ ఎడ్జ్ అల్టిమేట్ లెండ్ స్మార్ట్‌రిచ్ ప్రో క్రెడిట్ లెన్స్ క్యాష్ లోన్ - ఈఎంఐ కాలిక్యులేటర్ ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయడాన్ని, వాటి ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేయడాన్ని సైబర్ దోస్త్ స్పష్టంగా నిషేధించింది.

Details

వినియోగదారులకు సైబర్ దోస్త్ సూచనలు

యాప్ వాడకానికి ముందు ధృవీకరణ (Authentication) తప్పనిసరిగా చెక్ చేయాలి. RBI అంగీకరించిన లోన్ ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలి. వ్యక్తిగత డేటా ఇచ్చేముందు పూర్తి సమాచారం తెలుసుకొని, విశ్వసనీయత నిర్ధారించుకోవాలి. ఈ హెచ్చరిక, సూచనలు ప్రజలను మోసపూరిత ఆర్థిక యాప్‌ల నుంచి రక్షించడమే లక్ష్యంగా రూపొందించారు. మూడు విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి - అప్రమత్తత, ధృవీకరణ, ప్రైవసీ పరిరక్షణ.