తదుపరి వార్తా కథనం
ISRO: చంద్రయాన్-5కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. ఇస్రో చీఫ్ నారాయణన్ వెల్లడి
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 17, 2025
10:38 am
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రయాన్-5 మిషన్‌కు ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చిందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఆదివారం ప్రకటించారు.
చంద్రుడి పై పరిశోధన కోసం చంద్రయాన్-3లో 25 కిలోల బరువున్న రోవర్‌ను పంపించగా, చంద్రయాన్-5లో 250 కిలోల బరువున్న రోవర్‌ను పంపనున్నట్లు తెలిపారు.
2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 మిషన్‌లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన సంగతి తెలిసిందే.
కేవలం మూడు రోజుల క్రితమే చంద్రయాన్-5కు కేంద్రం నుంచి ఆమోదం లభించిందని, ఈ ప్రయోగాన్ని జపాన్‌తో కలిసి నిర్వహించనున్నట్లు నారాయణన్ తెలిపారు.
అలాగే, చంద్రుడి నమూనాలను సేకరించడానికి 2027లో చంద్రయాన్ 4ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చంద్రయాన్-5కి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
STORY | Centre has accorded approval for Chandrayaan-5 Mission: ISRO Chief
— Press Trust of India (@PTI_News) March 17, 2025
READ: https://t.co/7wYuQddvMn pic.twitter.com/Cs9U15RA71