LOADING...
CES 2026: ప్రపంచంలోనే తొలి 130 అంగుళాల మైక్రో RGB టీవీని ఆవిష్కరించిన శాంసంగ్ 
ప్రపంచంలోనే తొలి 130 అంగుళాల మైక్రో RGB టీవీని ఆవిష్కరించిన శాంసంగ్

CES 2026: ప్రపంచంలోనే తొలి 130 అంగుళాల మైక్రో RGB టీవీని ఆవిష్కరించిన శాంసంగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

CES 2026 వేదికగా శాంసంగ్ ప్రపంచంలోనే తొలి 130 అంగుళాల మైక్రో RGB టీవీ (R95H మోడల్)ను ఆవిష్కరించింది. ఇది ఇప్పటివరకు శాంసంగ్(Samsung) విడుదల చేసిన అతిపెద్ద మైక్రో RGB డిస్‌ప్లే కావడం విశేషం. అల్ట్రా ప్రీమియం టీవీలకు కొత్త డిజైన్ దిశను ఈ మోడల్ సూచిస్తుందని కంపెనీ తెలిపింది. "మైక్రో RGB మా పిక్చర్ క్వాలిటీ ఇన్నోవేషన్‌లో అత్యున్నత స్థాయి. కొత్త 130 అంగుళాల మోడల్ ఆ దృష్టిని మరింత ముందుకు తీసుకెళ్తుంది" అని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ విజువల్ డిస్‌ప్లే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హున్ లీ పేర్కొన్నారు.

వివరాలు 

టీవీకి కొత్త అర్థం చెప్పే డిజైన్

ఈ మైక్రో RGB టీవీలోని 130 అంగుళాల భారీ స్క్రీన్ సాధారణ టీవీలా కాకుండా పెద్ద కిటికీని తలపించేలా రూపొందించారు. ఇందులో 2013లో శాంసంగ్ ప్రవేశపెట్టిన టైమ్‌లెస్ గ్యాలరీ డిజైన్‌కు అప్‌గ్రేడ్ అయిన టైమ్‌లెస్ ఫ్రేమ్ను ఉపయోగించారు. గొప్ప ఆర్కిటెక్చరల్ విండోస్ నుంచి ప్రేరణ పొందిన ఈ ఫ్రేమ్, భారీ స్క్రీన్‌ను అంచుల మధ్య తేలుతున్నట్లుగా కనిపించేలా చేస్తుంది.

వివరాలు 

అద్భుతమైన వీక్షణ అనుభూతికి ఆధునిక టెక్నాలజీ

130 అంగుళాల మైక్రో RGB మోడల్‌లో Samsung అత్యాధునిక టెక్నాలజీలను అందించింది. ఇందులో Micro RGB AI Engine Pro, Micro RGB Color Booster Pro, Micro RGB HDR Pro వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ AI ఆధారంగా పనిచేసి మసకబారిన రంగులను మరింత ప్రకాశవంతంగా మార్చడంతో పాటు, లైట్, డార్క్ సీన్స్‌లో కాంట్రాస్ట్‌ను మెరుగుపరచి సూక్ష్మ వివరాలను స్పష్టంగా చూపిస్తాయి. అలాగే ఈ డిస్‌ప్లేకు HDR10+ ADVANCED సపోర్ట్‌తో పాటు మెరుగైన పిక్చర్, సౌండ్ కోసం Eclipsa Audioను కూడా అందించారు.

Advertisement

వివరాలు 

వీక్షణ అనుభూతిని పెంచే శాంసంగ్ ప్రత్యేక ఫీచర్లు

ఈ 130 అంగుళాల మైక్రో RGB టీవీలో Samsung సొంత Glare Free టెక్నాలజీ ఉంది. ఇది వెలుతురు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రతిబింబాలను తగ్గించి, రంగులు, కాంట్రాస్ట్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు, మెరుగుపరిచిన Vision AI Companion సపోర్ట్‌తో కన్వర్సేషనల్ సెర్చ్, ముందస్తు సిఫార్సులు, అలాగే AI Football Mode Pro, AI Sound Controller Pro, Live Translate, Generative Wallpaper, Microsoft Copilot, Perplexity వంటి పలు AI ఫీచర్లు, యాప్స్‌ను యాక్సెస్ చేసే సౌకర్యం కూడా ఈ మోడల్‌లో ఉంది.

Advertisement