LOADING...
ChatGPT: గూగుల్ సెర్చ్‌లో చాట్‌జీపీటీ వినియోగదారుల ప్రైవేట్ చాట్‌లు లీక్
గూగుల్ సెర్చ్‌లో చాట్‌జీపీటీ వినియోగదారుల ప్రైవేట్ చాట్‌లు లీక్

ChatGPT: గూగుల్ సెర్చ్‌లో చాట్‌జీపీటీ వినియోగదారుల ప్రైవేట్ చాట్‌లు లీక్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్ఏఐ (OpenAI) కి చెందిన చాట్‌జీపీటీ (ChatGPT)లో యూజర్లు చేసిన వ్యక్తిగత సంభాషణలు గూగుల్ సెర్చ్ కన్సోల్ (GSC) లో ప్రత్యక్షమవడం పెద్ద సంచలనంగా మారింది. సాధారణంగా GSC ను వెబ్‌సైట్ ట్రాఫిక్, సెర్చ్ డాటా పరిశీలించడానికి ఉపయోగిస్తారు. కానీ ఈసారి మాత్రం ప్రైవేట్ చాట్‌ల నుండి వచ్చిన వాక్యాలు అక్కడ కనిపించడం ఆశ్చర్యంగా మారింది. ఈ సమస్యను తొలిసారిగా Quantable అనే అనలిటిక్స్ సంస్థ యజమాని జేసన్ ప్యాకర్ తన బ్లాగ్‌లో బయటపెట్టారు.

క్రమరాహిత్యాలను ప్రశ్నించండి 

GSC నివేదికలు వింత ప్రశ్నలను చూపించడం ప్రారంభించాయి

సెప్టెంబర్ నుండి GSC రిపోర్టుల్లో కొత్తగా 300 అక్షరాల కంటే ఎక్కువ ఉన్న విచిత్రమైన సెన్సిటివ్ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇవి సాధారణ పదాలు కాకుండా, వ్యక్తులు ChatGPT కు అడిగిన వ్యక్తిగత సందేహాలు. ఉదాహరణకు సంబంధ సమస్యలు, వ్యాపార సలహాలు వంటి విషయాలపై ఉన్న ప్రశ్నలు కూడా బయట పడ్డాయి.

పరిశోధన ఫలితాలు 

OpenAI గూగుల్ శోధనను స్క్రాప్ చేస్తుండవచ్చు 

ఈ వ్యవహారాన్ని మరింతగా పరిశీలించేందుకు జేసన్ ప్యాకర్, వెబ్ ఆప్టిమైజేషన్ నిపుణుడు స్లోబోడాన్ మానిక్ కలిసి పని చేశారు. వారి అంచనాల ప్రకారం OpenAI గూగుల్ సెర్చ్‌ను క్రాల్ చేసే సమయంలో వినియోగదారుల అసలు ప్రాంప్ట్‌లు కూడా సర్వ్ అయ్యే అవకాశం ఉంది అని వారు పేర్కొన్నారు. ఈ కారణంగా చాట్‌లోని యూజర్ మెసేజెస్ సెర్చ్ రిజల్ట్‌ల్లోకి వచ్చినట్లు వారు సూచించారు.

సమస్య పరిష్కారం 

కంపెనీ సమస్యను గుర్తించింది 

ఇక ఈ విషయంపై OpenAI స్పందిస్తూ.. కొంతకాలం సాంకేతిక లోపం కారణంగా సెర్చ్ క్వెరీస్ తప్పుగా రూట్ అయ్యాయి, ఇప్పుడు సమస్యను పరిష్కరించాం అని తెలిపింది. అయితే ప్యాకర్ మాత్రం OpenAI గూగుల్ డేటాను స్క్రాప్ చేస్తోందనే అనుమానం తొలగలేదని అంటున్నారు. ముఖ్యంగా ఈసారి యూజర్లు తమ చాట్‌ను షేర్ చేయాల్సిన అవసరమే లేకుండా, "ఎవరూ షేర్ క్లిక్ చేయకుండా" డేటా బయటకు వచ్చిందన్న అంశం మరింత ఆందోళన కలిగిస్తోంది.