
Chat GPT: ఏడాది కాదు.. పదేళ్లు.. డాక్టర్లు గుర్తించని రోగాన్ని చాట్‌జీపీటీ గుర్తించింది!
ఈ వార్తాకథనం ఏంటి
దశాబ్దకాలంగా కొనసాగుతున్న వైద్య సమస్యకు మూలకారణాన్ని కనుగొనడంలో చాట్‌జీపీటీ కీలకంగా సాయపడిందని ఓ రెడిట్ యూజర్ వెల్లడించారు. ఆయన వివరించిన ప్రకారం, 10 సంవత్సరాలుగా తాను అనేక వైద్యులను సంప్రదించినప్పటికీ తన సమస్యకు సరైన నిర్ధారణ జరగలేదని తెలిపారు. వైద్యులు విఫలమైన చోట చాట్‌జీపీటీ విజయం ''చాట్‌జీపీటీ 10+ ఏళ్ల సమస్యను పరిష్కరించింది'' అనే శీర్షికతో ఒక పోస్ట్‌ను రెడిట్‌లో @Adventurous-Gold6935 అనే యూజర్ షేర్ చేశారు. పదేళ్లుగా మానసిక, శారీరకంగా బాధపడుతూ, ఎన్నో వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ తాను ఎదుర్కొంటున్న సమస్యకు అసలు కారణం ఏంటో తేలలేదన్నారు. న్యూమరలజిస్టులు సహా అనేక నిపుణులు నిర్ధిష్టంగా ఏమీ చెప్పలేకపోయారని వాపోయారు.
Details
ఎన్ని పరీక్షలు చేసినా ప్రయోజనం లేకుండా
ఎంఆర్ఐ, సీటీ స్కాన్, బ్లడ్ టెస్టులు, లైమ్ వ్యాధి పరీక్షలు ఇలా ఎన్ని టెస్టులు చేసినా సమస్య తేలలేదన్నారు. దేశంలోని ప్రఖ్యాత హెల్త్ కేర్ సంస్థల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదన్నారు. చాట్‌జీపీటీకి వివరించగానే.. చివరకు తన అన్ని లక్షణాలు, వైద్యుల వ్యాఖ్యలు, నివేదికలతో సహా సమస్యను చాట్‌జీపీటీకి వివరించానని చెప్పారు. ఆశ్చర్యకరంగా కొద్ది సేపట్లోనే సమస్యకు సరైన నిర్ధారణ ఇచ్చిందన్నారు. తనకు హోమోజైగస్ A1298C MTHFR మ్యూటేషన్ ఉన్నట్టు చెప్పిందని పేర్కొన్నారు. ఇది అరుదైన జన్యు సమస్య అని, ప్రపంచ జనాభాలో 7-12% మందిలో మాత్రమే కనిపిస్తుందని చాట్‌జీపీటీ వివరించిందని తెలిపారు.
Details
షాక్‌లోకి వెళ్లిన వైద్యులు
బీ12 స్థాయిలు సాధారణంగానే ఉన్నా, మ్యూటేషన్ కారణంగా శరీరం వాటిని సరిగ్గా ఉపయోగించలేదని, అందుకే బీ12 సప్లిమెంట్స్ అవసరమని చాట్‌జీపీటీ సూచించిందన్నారు. ఇది తెలుసుకుని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ఆశ్చర్యపోయారని చెప్పారు. ఆ మందులు వాడిన తర్వాత ఆరోగ్యపరంగా తనకు స్పష్టమైన మెరుగుదల కనిపించిందని చెప్పారు. నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన ఈ పోస్ట్‌కు 6,000కు పైగా అప్‌వోట్లు వచ్చాయి. "ఇది ఆశ్చర్యకరమైనదే కానీ, మన వైద్య వ్యవస్థ తక్షణమే సాంకేతికతను ఆలింగనం చేయాల్సిన అవసరం ఎంతవో చూపిస్తుందని ఒకరు వ్యాఖ్యానించారు. జన్యు స్క్రీనింగ్‌ను వైద్యులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు చాట్‌జీపీటీ నిన్ను అక్షరాలా రక్షించిందని ప్రశంసించారు.