LOADING...
ChatGPT: చాట్‌జీపీటీతో ఎక్కువ సమయం? ఇప్పుడు బ్రేక్‌కు రిమైండర్ ఇచ్చే ఫీచర్‌తో ఓపెన్‌ఏఐ!
చాట్‌జీపీటీతో ఎక్కువ సమయం? ఇప్పుడు బ్రేక్‌కు రిమైండర్ ఇచ్చే ఫీచర్‌తో ఓపెన్‌ఏఐ!

ChatGPT: చాట్‌జీపీటీతో ఎక్కువ సమయం? ఇప్పుడు బ్రేక్‌కు రిమైండర్ ఇచ్చే ఫీచర్‌తో ఓపెన్‌ఏఐ!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ AI సంస్థ ఓపెన్‌ఏఐ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. చాట్‌జీపీటీతో మీరు చాలా ఎక్కువ సమయం పాటు మాట్లాడుతుంటే, అది మెల్లగా ఓ రిమైండర్ ఇస్తుంది - "బ్రేక్ తీసుకోండి" అని. వినోదంగా వినిపించచ్చు కానీ, దీని వెనక ఒక మంచి ఉద్దేశం ఉంది. AI వినియోగాన్ని ఆరోగ్యకరంగా మార్చేందుకు ఇది ఒక భాగం. "ఎంత టైం గడిపారు అన్నదాని కంటే, మీరు ఎటువంటి పనితో వచ్చారో అది పూర్తయిందా అనే దానిపైనే మాకు ఎక్కువ శ్రద్ధ" అని చెప్పింది. అందుకే ఇప్పుడు మీరు ఎక్కువ సేపు చాట్ చేస్తే, ఒక మృదువైన సందేశం కనిపిస్తుంది అని OpenAI ఓ బ్లాగ్‌లో ప్రకటించింది.

వివరాలు 

ఫీచర్ ప్రవర్తన ఎలా ఉండాలి, ఎప్పుడు కనిపించాలి..

"Just checking in. You've been chatting for a while-is this a good time for a break?" ఇది కనపడిన తర్వాత, మీరు "చాట్ కొనసాగించండి"లేదా "ఇది సహాయపడింది"అనే రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రవర్తన ఎలా ఉండాలి, ఎప్పుడు కనిపించాలి అనే అంశాల్లో ఇంకా ట్యూనింగ్ చేస్తామని OpenAI తెలిపింది.తద్వారా ఇది సహజంగానూ,ఉపయోగకరంగానూ అనిపించాలి అని వారి అభిప్రాయం. ఇంతే కాదు.. ఇంకొక కొత్త ఫీచర్ కూడా రాబోతోంది.'High-stakes personal decisions' అంటే జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించి ChatGPT ఇప్పుడు నేరుగా సమాధానాలు ఇవ్వకుండా,మిమ్మల్ని ఆలోచింపజేసేలా ప్రశ్నలు వేయడం,మంచి చెడు పరిగణనలోకి తీసుకోవడం వంటి మార్గాల్లో సహాయం చేస్తుందని OpenAI వెల్లడించింది.

వివరాలు 

 తాజా ఫీచర్లు వినియోగదారుల ఆరోగ్యకరమైన వాడకాన్ని ప్రోత్సహించడానికే ..

ఈ కొత్త మార్పులు ఇటీవల వచ్చిన ఓ విమర్శల నివేదిక తర్వాతే వచ్చినవిగా కనిపిస్తున్నాయి. జూన్‌లో New York Times నివేదిక ప్రకారం, ChatGPT కొన్నిసార్లు వినియోగదారులకు ఓవరుగా అంగీకరిస్తోంది, పొగిడేస్తోంది, అప్పుడప్పుడు అసత్య సమాచారం అందిస్తోంది ("హాల్యూసినేషన్"). దీనివల్ల కొంతమంది యూజర్లు తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండే స్థాయికి చేరుకున్నారని ఆ రిపోర్ట్ పేర్కొంది. గతంలో GPT-4o అప్‌డేట్ తర్వాత, బాటు ఎక్కువగా వినియోగదారుల అభిప్రాయాలకు పూర్ణంగా అంగీకరించేది - నిజమైన, తప్పైన . దీన్ని OpenAI గతంలోనే అంగీకరించింది. అప్పట్లో ఆ అప్‌డేట్‌ను వెనక్కి తీసేసినా, ఇప్పుడు ఈ తాజా ఫీచర్లు వినియోగదారుల ఆరోగ్యకరమైన వాడకాన్ని ప్రోత్సహించడానికే అని చెబుతోంది సంస్థ.

వివరాలు 

ఈ మోడల్‌కు మోడల్ పికర్ ఉండదు

ఇక మరోవైపు, OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ కూడా కొత్త GPT-5 మోడల్‌ను టీజర్ రూపంలో పరిచయం చేస్తున్నారు. ఇది త్వరలోనే రిలీజ్ కానుందని సమాచారం. ఈ మోడల్‌కు మోడల్ పికర్ ఉండదు. అంటే reasoning మోడల్, GPT మోడల్ అంటూ వేరే వేరుగా ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు. AI స్వయంగా ఏది అవసరమో అర్థం చేసుకుని పని చేస్తుంది. మొత్తానికి, ChatGPT మరింత హ్యూమన్‌లాగా, మారుతోందని చెప్పొచ్చు!