LOADING...
ChatGPT: చాట్ జీపీటీలో కొత్త స్టడీ మోడ్ ఫీచర్‌..విద్యార్థులకు మరింత ఉపయోగం..! 

ChatGPT: చాట్ జీపీటీలో కొత్త స్టడీ మోడ్ ఫీచర్‌..విద్యార్థులకు మరింత ఉపయోగం..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన AI చాట్‌బాట్‌లలో ఓపెన్‌ఏఐ ChatGPT ఒకటి. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు దీన్ని తరచుగా నవీకరిస్తూ వస్తున్నారు. తాజాగా, ఓపెన్‌ఏఐ విద్యార్థుల అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'స్టడీ మోడ్' అనే కొత్త ఫీచర్‌ను చాట్‌జీపీటీలో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌తో చదువు మరింత సులభతరంగా మారుతుంది. స్టడీ మోడ్‌ విద్యార్థులకు త్వరితగతిన, తెలివైన మరియు లోతైన అధ్యయనంలో తోడ్పడుతుంది.

వివరాలు 

స్టడీ మోడ్ అంటే ఏంటి? 

స్టడీ మోడ్‌ ఉపయోగించితే కేవలం ప్రశ్నలకు సమాధానాలు పొందడమే కాదు, వాటిని దశల వారీగా విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా వినియోగదారుని అర్థంపూర్తిగా చేయడంతో పాటు, అభిప్రాయాల ప్రకారం సమాధానాలను అందిస్తుంది. దీని వలన నేర్చుకోవడం బాగా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఫీచర్‌ పూర్తిగా ఉచితం. ప్రస్తుతానికి ఇది ChatGPT Plus, Pro, Teams లాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను వినియోగిస్తున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇది ChatGPT Edu వర్షన్‌లో కూడా చేర్చే అవకాశం ఉంది.

వివరాలు 

11 భారతీయ భాషలకు మద్దతు 

ఈ స్టడీ మోడ్‌ను ఓపెన్‌ఏఐ భారతదేశంలో 11 ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వలన దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు ఈ ఫీచర్‌ను సులభంగా ఉపయోగించుకునే వీలుంది. వాయిస్, టెక్స్ట్, ఇమేజ్‌ వంటి మల్టీపుల్ ఇన్‌పుట్ మోడ్‌లను ఈ ఫీచర్ మద్దతిస్తుంది. ఫలితంగా అధ్యయనం మరింత ఇంటరాక్టివ్‌ అయి, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా మారుతుంది.

వివరాలు 

లియా బెల్స్కీ వ్యాఖ్యలు 

ఓపెన్‌ఏఐలో విద్యా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్న లియా బెల్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం - స్టడీ మోడ్‌ ద్వారా విద్యార్థులకు సమాధానాల కంటే ఎక్కువగా దిశానిర్దేశం చేయడానికే దృష్టి పెట్టారు. పరీక్షలలో ఈ మోడ్‌తో వచ్చిన సమాధానాల నాణ్యత చాలా బాగుందని అభిప్రాయాలు వచ్చాయి. IIT స్థాయిలో ఉన్న క్లిష్టమైన ప్రశ్నలకూ ఇది సమర్థవంతమైన సమాధానాలను ఇచ్చింది. భారతీయ విద్యార్థులతో ఈ మోడ్‌పై బీటా టెస్టింగ్ నిర్వహించగా, ఇది రోజువారీ అధ్యయనాల నుంచి పోటీ పరీక్షల వరకూ ఉపయోగపడినట్లు తేలింది. ప్రత్యేకించి, ప్రారంభ పరీక్షల్లో IIT సంబంధిత కఠిన ప్రశ్నలకు కూడా ఈ మోడ్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వగలదని నిరూపితమైంది.

వివరాలు 

స్టడీ మోడ్ ఎలా వినియోగించాలి? 

ఈఫీచర్‌ను ఉపయోగించాలంటే,మీరు ChatGPTలో Tools సెక్షన్‌కి వెళ్లాలి. అక్కడ 'Study and Learn'అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేసి మీ ప్రశ్నను టైప్ చేయండి. అనంతరం AI మీ ప్రశ్నకు స్పష్టంగా,దశలవారీగా సమాధానాన్ని అందిస్తుంది.మీరు సమాధానంతో పూర్తిగా సంతృప్తిగా లేరని భావిస్తే,మరిన్ని వివరాల కోసం సూచనలు కూడా ఇవ్వవచ్చు. చాట్‌బాట్ వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది.ప్రస్తుతం మార్కెట్లో గూగుల్ జెమినీ కూడా పోటీగా ఉంది. ChatGPT స్టడీమోడ్‌ ఈ పోటీని సమర్థంగా ఎదుర్కొంటుందా లేదా అనే విషయం చూడాల్సిందే. ఇటీవలే గూగుల్ తన కొత్త సెర్చ్ ఇంజన్‌ను కూడా విడుదల చేసింది. అటువంటి పోటీ పరిస్థితుల్లో ChatGPT కొత్తగా ప్రవేశపెట్టిన స్టడీ మోడ్‌ దాని ప్రాముఖ్యతను నిలబెట్టుకుంటుందా లేదా అన్నది ఆసక్తికర అంశం.