LOADING...
AI: వృద్ధాప్యానికి చెక్‌.. వయసు తగ్గించే ఏఐ టెక్నాలజీ సంచలనం
వృద్ధాప్యానికి చెక్‌.. వయసు తగ్గించే ఏఐ టెక్నాలజీ సంచలనం

AI: వృద్ధాప్యానికి చెక్‌.. వయసు తగ్గించే ఏఐ టెక్నాలజీ సంచలనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

యువకుడిలా ఎప్పటికీ తాజాగా, యవ్వనంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. వయసు పెరిగేకొద్దీ నిజమైన వయసుకంటే తక్కువగా కనిపించాలని చాలా మంది ఆశిస్తుంటారు. అందుకోసం మంచి ఆహారం, యోగా, ప్రత్యేక చికిత్సలు వంటి ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తారు. అయినా గడియారాన్ని వెనక్కి తిప్పలేము. కానీ భవిష్యత్తులో వయసును తగ్గించుకోవడం కూడా అసాధ్యం కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పుకు కారణం అవుతోన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). టెక్ దిగ్గజం ఓపెన్‌ఏఐ, బయోటెక్నాలజీ సంస్థ రెట్రో బయోసైన్సెస్ కలిసి ఈ రంగంలో కీలక అడుగు వేశాయి. వీరు సంయుక్తంగా వృద్ధ కణాలను తిరిగి సజీవంగా మార్చగలిగే సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు.

details

నూతన ప్రోటీన్ లను సృష్టించడమే లక్ష్యం

ఇది మానవ ఆయుష్షు పెంపు లక్ష్యంగా జరుగుతున్న పరిశోధనలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇరు సంస్థలు GPT-4b మైక్రో అనే ప్రత్యేక ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశాయి. ఇది సాధారణ ఏఐ చాట్‌బాట్‌లా కాకుండా, కేవలం జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందింది. ముఖ్యంగా ప్రొటీన్‌ల నిర్మాణం, 3D మాలిక్యులర్ స్ట్రక్చర్లు, బయోసైన్స్ డేటాపై దీన్ని ట్రైన్ చేశారు. పునరుత్పాదక వైద్యానికి అవసరమైన కొత్త ప్రొటీన్‌లను సృష్టించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ ఏఐ సాయంతో శాస్త్రవేత్తలు ఇప్పటికే నోబెల్ బహుమతి పొందిన 'యమనక ఫ్యాక్టర్స్‌' అనే ప్రొటీన్‌లను మెరుగుపరచగలిగారు. సాధారణంగా ఇవి వయోజన కణాలను తిరిగి స్టెమ్ సెల్స్‌గా మార్చే సామర్థ్యం కలిగి ఉంటాయి.

details

 "GPT-4b మైక్రో సాయంతో  గణనీయమైన మెరుగుదల

కానీ ఏఐ రూపకల్పన చేసిన కొత్త వెర్షన్ ప్రొటీన్‌లు ల్యాబ్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు చూపించాయి. పాత యమనక ఫ్యాక్టర్స్‌తో పోలిస్తే, ఏఐ సృష్టించిన ప్రొటీన్‌లకు గురైన కణాలు 50 రెట్లు వేగంగా, మరింత సమర్థవంతంగా యవ్వన లక్షణాలను తిరిగి పొందాయి. అంతేకాకుండా, డీఎన్‌ఏలో జరిగిన నష్టాన్ని కూడా ఇవి అత్యంత వేగంగా మరమ్మతు చేశాయి. ఈ సంచలనాత్మక ఇన్నోవేషన్‌పై ఓపెన్‌ఏఐ బ్లాగ్‌పోస్ట్‌లో స్పందిస్తూ - "GPT-4b మైక్రో సాయంతో యమనక ఫ్యాక్టర్స్‌లో గణనీయమైన మెరుగుదల సాధించాం. ఇవి స్టెమ్ సెల్ రీప్రోగ్రామింగ్ మార్కర్‌లను సాధారణ నియంత్రణలతో పోలిస్తే 50 రెట్లు అధికంగా వ్యక్తీకరించాయని పేర్కొంది.