Claude AI Google Meet: లైవ్ మీటింగ్‌లో Claude AI.. Anthropic కొత్త ఫీచర్ అదుర్స్!
ఈ వార్తాకథనం ఏంటి
వీడియో మీటింగ్ జరుగుతోంది.. ఒకరు ఐడియా చెబుతున్నారు, మరొకరు లెక్కలు వివరిస్తున్నారు. ఇంతలో అదే మీటింగ్‌లో Claude AI కూడా కనిపిస్తే? ఇప్పుడు ఇది ఊహ కాదు. ఆంత్రోపిక్ తీసుకొచ్చిన Claude Meetings ఫీచర్‌తో గూగుల్ మీట్ వీడియో కాల్స్‌లో Claudeను ఒక కనిపించే పార్టిసిపెంట్‌గా యాడ్ చేసుకోవచ్చు. మీటింగ్‌లో జరుగుతున్న చర్చను అర్థం చేసుకోవడంతో పాటు, అక్కడే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ప్లాన్‌లు రూపొందించడం, టైమ్‌లైన్లు తయారు చేయడం వంటి పనులను Claude చేయగలదు.
Details
మీటింగ్ తర్వాత కాదు.. అప్పుడే పని
ఇప్పటివరకు మీటింగ్‌ల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్కువగా రికార్డింగ్, ట్రాన్స్‌క్రిప్షన్, సారాంశం తయారు చేయడం వరకే పరిమితమైంది.
Claude Meetings ఆ విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. చర్చ జరుగుతున్న సమయంలోనే అందులోని విషయాలను తీసుకుని తదుపరి పనిని ప్రారంభించడం దీని ప్రత్యేకత.
ఉదాహరణకు ఒక టీమ్ కొత్త యాప్ గురించి మాట్లాడుకుంటే.. ఆ ఆలోచనను అర్థం చేసుకుని దాన్ని రూపొందించే ప్రక్రియలో Claude సహకరించగలదు.
Details
టీమ్‌లకు మరింత ఉపయోగకరం
ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో Team, Enterprise కస్టమర్లకు Google Meet ద్వారా అందుబాటులోకి వస్తోంది.
భవిష్యత్తులో ఇతర మీటింగ్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా విస్తరించనున్నట్లు Anthropic తెలిపింది. ఇదే సమయంలో Claude Whiteboards, Claude Sheets, Claude Data వంటి కొత్త టూల్స్‌ను కూడా సంస్థ ప్రకటించింది.
చర్చలను టైమ్‌లైన్లు, యాక్షన్ ప్లాన్‌లుగా మార్చడమే వీటి ప్రధాన ఉద్దేశం.
Details
ఆఫీస్ పనుల్లో AI పాత్ర మారుతోందా?
Anthropic తాజా అడుగులతో AI కేవలం మనం చెప్పింది రాసే సాధనంగా కాకుండా.. మనతో కలిసి పని చేసే సహోద్యోగిలా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, కంపెనీ అమెరికా IPO కోసం $64.4 బిలియన్ల వరకు సమీకరించే ప్రణాళికను ప్రకటించింది.
సంస్థ విలువను $1.02 ట్రిలియన్‌గా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో Claudeను రోజువారీ ఆఫీస్ పనుల్లో మరింత చురుకైన భాగస్వామిగా మార్చే ప్రయత్నం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.