Claude voice: క్లాడ్ వాయిస్ మోడ్‌లో ఒపస్, సోనెట్ మోడళ్లు.. ఆంత్రోపిక్ కొత్త అప్‌డేట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ తన క్లాడ్ వాయిస్ మోడ్‌కు మరో కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు వేగంగా స్పందించే హైకు (Haiku) మోడల్‌తో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఇప్పుడు శక్తివంతమైన ఒపస్ (Opus), సోనెట్ (Sonnet) మోడళ్లకూ విస్తరించింది. అలాగే జీమెయిల్, స్లాక్ వంటి యాప్‌లతో వాయిస్ మోడ్‌ను అనుసంధానించే అవకాశాన్ని కూడా కల్పించింది. ప్రారంభంలో సాధారణ ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇవ్వడానికే ఈ వాయిస్ మోడ్‌ను తీసుకొచ్చినా, వినియోగదారులు దీనిని వ్యాపార అవసరాలు, క్లిష్టమైన పనుల పరిష్కారానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ఆంత్రోపిక్ గుర్తించింది.
వివరాలు
ఈ బాషలలో క్లాడ్ వాయిస్ మోడ్ సేవలను విస్తరించిన ఆంత్రోపిక్
దీంతో లోతైన విశ్లేషణ, సమగ్ర సమాధానాలు ఇవ్వగలిగే ఒపస్, సోనెట్ మోడళ్లను కూడా వాయిస్ మోడ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ మోడళ్లు సంభాషణలోని ముఖ్యాంశాలను ఒక పేజీ ప్రతిపాదనగా రూపొందించడం, రైలు ఆలస్యమైతే క్యాలెండర్ అపాయింట్‌మెంట్‌లను ఆటోమేటిక్‌గా మార్చడం వంటి పనులను కూడా చేయగలవని ఆంథ్రోపిక్ వెల్లడించింది.
అంతేకాకుండా, వినియోగదారులు సంభాషణ మధ్యలోనే టెక్స్ట్ నుంచి వాయిస్‌కు లేదా వాయిస్ నుంచి టెక్స్ట్‌కు మారే అవకాశం ఉండటంతో పాటు, హైకు నుంచి ఒపస్ వంటి ఇతర మోడళ్లకు కూడా సులభంగా మారవచ్చు.
మరోవైపు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పోర్చుగీస్ భాషల్లో కూడా క్లాడ్ వాయిస్ మోడ్ సేవలను విస్తరించినట్లు ఆంత్రోపిక్ వెల్లడించింది.