LOADING...
CMF Watch 3 Pro: చాట్‌జిపిటీతో కొత్త స్మార్ట్‌వాచ్.. CMF Watch 3 Pro లాంచ్!
చాట్‌జిపిటీతో కొత్త స్మార్ట్‌వాచ్.. CMF Watch 3 Pro లాంచ్!

CMF Watch 3 Pro: చాట్‌జిపిటీతో కొత్త స్మార్ట్‌వాచ్.. CMF Watch 3 Pro లాంచ్!

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్‌లో CMF by Nothing తన కొత్త స్మార్ట్‌వాచ్ CMF Watch 3 Pro ను విడుదల చేసింది. ఈ వాచ్‌లో సర్క్యులర్ AMOLED డిస్‌ప్లే, డ్యూయల్‌బ్యాండ్ GPS వంటి ఫీచర్లు అందించారు. ముఖ్యంగా AI ఆధారిత ఫిట్‌నెస్ ఫీచర్లు ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 13 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ధర విషయానికి వస్తే ₹7,999గా నిర్ణయించగా, లాంచ్ ఆఫర్‌లో ₹6,999కి లభించనుంది. మే 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ సహా దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. డిజైన్ పరంగా చూస్తే మెటల్ ఫ్రేమ్‌తో స్టైలిష్‌గా, తేలికగా ఉండేలా తయారు చేశారు.

వివరాలు 

అవుట్‌డోర్ యాక్టివిటీస్ కోసం GPS సపోర్ట్

రౌండ్ డయల్‌తో బ్రైట్ AMOLED స్క్రీన్ ఇవ్వగా,యూజర్లకు తమకు నచ్చినట్లుగా వాచ్ ఫేస్‌లు,స్ట్రాప్ ఆప్షన్‌లు ఎంచుకునే సౌకర్యం కల్పించారు. అవుట్‌డోర్ యాక్టివిటీస్ కోసం డ్యూయల్‌బ్యాండ్ మల్టీ సిస్టమ్ GPS సపోర్ట్ ఉంది. అలాగే AI రన్నింగ్ కోచ్ ద్వారా వర్కౌట్ గైడెన్స్,ట్రైనింగ్ ఇన్‌సైట్స్ అందుతుంది. హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే హార్ట్‌రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్,యాక్టివిటీ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ ఆప్టికల్ సెన్సర్‌తో వర్కౌట్స్ సమయంలో కూడా ఖచ్చితమైన డేటా ఇస్తుంది. Android 6.0+,iOS 13+డివైస్‌లకు సపోర్ట్ ఉండగా,Bluetooth 5.3 ద్వారా కనెక్ట్ అవుతుంది. Nothing X app ద్వారా కాల్స్,మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు, ఇన్‌బిల్ట్ చాట్‌జీపీటీ సపోర్ట్‌తో వెంటనే ప్రశ్నలకు సమాధానాలు పొందే సౌకర్యం కూడా ఉంది.

Advertisement