ఏఐ తయారు చేసిన కోకో కోలా గురించి విన్నారా? ఇది తెలుసుకోవాల్సిందే
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తి ఎంత వేగంగా పెరుగుతుందో అందరికీ తెలుసు. దాదాపు ప్రతీ రంగంలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. తాజాగా కోకో కోలా తయారీలోనూ ఏఐ ని ఉపయోగించారు. అవును, మీరు విన్నది నిజమే, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కోకో కోలాను తయారు చేసారు. అయితే ఇది పూర్తి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసింది కాదు. కొంత భాగం మనుషులు, కొంతభాగం ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి కోకో కోలాను తయారు చేసారు. ఈ డ్రింక్ ని కోకో కోలా కంపెనీ ఫ్యూచర్ ఫ్లేవర్ డ్రింక్ అంటున్నారని సీఎన్బీసీ కథనం రాసుకొచ్చింది.
రెండు వెరైటీల్లో లభిస్తున్న కోకో కోలా
సీఎన్బీసీ కథనం ప్రకారం, ఈ కోకో కోలా డ్రింక్, రెండు వెరైటీల్లో లభిస్తుంది. ఒకటి, రెగ్యులర్ రకం, మరోటి జీరో షుగర్ రకం. జీరో షుగర్ రకం డ్రింక్ అనేది లిమిటెడ్ ఎడిషన్ లో అందుబాటులో ఉండనుంది. అది కూడా అమెరికా, కెనడా, చైనా, యూరప్, ఆఫ్రికా దేశాల మార్కెట్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు, ఏఐ టెక్నాలజీ ద్వారా కోకో కోలా క్యాన్స్ ప్యాకేజింగ్ కూడా చేయబోతున్నారు. మొత్తానికి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చాలా మార్పులు వస్తున్నాయి.