Google AI Features: గుడ్ న్యూస్.. గూగుల్‌లో ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లు, ఎలా వాడాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. భారత్, జపాన్ లోని యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ టూలో జెనరేటివ్ ఏఐని అందిస్తోంది.
దీంతో స్థానిక భాషలతో టెక్ట్స్, విజువల్ రిజల్ట్స్ చూసే ఆప్షన్‌ను చూడొచ్చు.
సెర్చ్ ల్యాబ్స్ ద్వారా ఫీచర్ ని టెస్టింగ్ చేసేందుకు ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులో ఉండే సైన్ అప్ ఫ్లాట్ ఫారమ్ అని పేర్కొనవచ్చు.
ఈ ఫీచర్లను గూగుల్ క్రోమ్, గూగుల్ యాప్ లో కొత్త ఫీచర్ ను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
ఏఐ ఇటీవల కాలంలో చాలా పాపులర్ కావడంతో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది.
Details
కొత్త విషయాలను లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం
జెనరేటివ్ ఏఐ యూజర్లకు సెర్చ్ రిజిల్ట్స్ ఇంకా బాగా అర్థం కావడానికి వీడియోలు, ఫోటోల రూపంలో టెక్ట్స్ ఆధారిత సెర్చ్ రిజల్ట్స్ తో పాటు కంటెంట్‌ను కూడా అందించనుంది.
గూగుల్ తన సెర్చ్ టూల్‌కి భారత్, జపాన్ లోని యూజర్ల కోసం జెనరేటివ్ ఏఐని తీసుకొచ్చింది. దీని వల్ల స్థానిక భాషలలో టెక్ట్స్, విజువల్స్ చూడొచ్చు. అయితే గూగుల్ యూజర్లు ముందుగా తమ జీమెయిల్ ఐడీలో సైన్ కావాల్సి ఉంటుంది.
జెనరేటివ్ ఏఐ యూజర్లు సెర్చ్ ఫలితాలను వేగంగా ఆర్థం చేసుకోవడంతో పాటు కొత్త విషయాలను లోతుగా అధ్యయనం చేయడానికి వీలు ఉంటుంది.
లాంగ్వేజ్ టోగుల్ బటన్‌ను ట్యాప్ చేస్తే ఇంగ్లీషు రిజల్ట్స్ నుంచి హిందీకి మారడానికి గూగుల్ సెర్చ్ అనుమతిస్తుంది.