LOADING...
OpenAI: ఇక మొబైల్‌లోనే కోడెక్స్.. చాట్‌జీపీటీ యాప్‌లో ఓపెన్ ఏఐ కొత్త ఫీచర్
ఇక మొబైల్‌లోనే కోడెక్స్.. చాట్‌జీపీటీ యాప్‌లో ఓపెన్ ఏఐ కొత్త ఫీచర్

OpenAI: ఇక మొబైల్‌లోనే కోడెక్స్.. చాట్‌జీపీటీ యాప్‌లో ఓపెన్ ఏఐ కొత్త ఫీచర్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 15, 2026
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధస్సు రంగంలో ముందంజలో ఉన్న ఓపెన్ ఏఐ తన ఏఐ కోడింగ్ అసిస్టెంట్ కోడెక్స్‌ను ఇప్పుడు మొబైల్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై డెవలపర్లు తమ స్మార్ట్‌ ఫోన్ ద్వారానే కోడింగ్ టాస్క్‌లను మేనేజ్ చేయడంతో పాటు, వాటిని అప్రూవ్ చేసే అవకాశం పొందనున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్, అండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రివ్యూ రూపంలో చాట్ జీపీటి యాప్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు కోడెక్స్ సేవలు ప్రధానంగా డెస్క్‌టాప్‌లు, రిమోట్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్‌లకే పరిమితమయ్యాయి. అయితే తాజా అప్‌డేట్‌తో మొబైల్ ద్వారా కూడా డెవలపర్లు తమ కోడింగ్ పనులను ఎక్కడి నుంచైనా ట్రాక్ చేయగలుగుతారు.

వివరాలు

మొబైల్ కోడెక్స్ వల్ల ప్రయోజనాలు

ఈ కొత్త ఫీచర్ గురించి ఓపెన్ ఏఐ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ప్రతి వారం 4 మిలియన్లకు పైగా మంది కోడెక్స్‌ను ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న అప్డేట్‌లు కూడా ప్రాజెక్ట్ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక చిన్న చెక్-ఇన్ వల్ల unnecessary rework తగ్గడమే కాకుండా, సరైన కాంటెక్స్ట్‌తో కోడెక్స్ పని ముందుకు సాగుతుందని తెలిపింది. ఈ అప్‌డేట్ ద్వారా యూజర్లు తమ ల్యాప్‌టాప్‌లు, డెవ్‌బాక్స్‌లు లేదా రిమోట్ మేనేజ్‌డ్ ఎన్విరాన్‌మెంట్‌లతో కనెక్ట్ అయి, వాటి లైవ్ స్టేటస్‌ను మొబైల్‌లోనే చూడగలుగుతారు.

వివరాలు

సెక్యూర్ రిలే లేయర్‌తో మరింత భద్రత

మొబైల్ కోడెక్స్‌లో ప్రత్యేకంగా సెక్యూర్ రిలే లేయర్‌ను అందించారు. దీని ద్వారా నమ్మకమైన డివైస్‌లు పబ్లిక్ ఇంటర్నెట్‌కు నేరుగా ఎక్స్‌పోజ్ కాకుండానే వివిధ డివైస్‌ల నుంచి యాక్సెస్ చేయవచ్చు. అలాగే చాట్ జీపీటీలో ఎక్కడ లాగిన్ అయి ఉన్నా, యాక్టివ్ సెషన్ స్టేట్, కాంటెక్స్ట్ సింక్ అవుతూ ఉంటుంది. దీంతో ఎక్కువ సమయం పట్టే కోడింగ్ టాస్క్‌లలో అవసరమైన సమయంలో యూజర్ ఇన్‌పుట్ ఇవ్వడం మరింత సులభం అవుతుంది.

Advertisement

వివరాలు

కోడెక్స్‌లో కొత్త ఫీచర్లు

మొబైల్ వెర్షన్‌లో మరికొన్ని కీలక ఫీచర్లను కూడా ఓపెన్ ఏఐ జోడించింది. వీటిలో: మేనేజ్‌డ్ ఎన్విరాన్‌మెంట్‌లలో రిమోట్ SSH యాక్సెస్ ప్రాంప్ట్ స్కానింగ్ కోసం హుక్స్ కన్వర్సేషన్ లాగింగ్ కోడెక్స్ ప్రవర్తనను కస్టమైజ్ చేసే ఆప్షన్లు రిలీజ్ వర్క్‌ఫ్లోల కోసం స్కోప్డ్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ టోకెన్లు ఉన్నాయి. అలాగే ChatGPT ఎంటర్‌ప్రైజ్ వర్క్‌స్పేస్‌ల కోసం HIPAA కంప్లయన్స్‌ను కూడా ఎనేబుల్ చేశారు. దీంతో హెల్త్‌కేర్ రంగంలో ఉపయోగించే ఏఐ వర్క్‌ఫ్లోలకు మరింత భద్రత, నియంత్రణ లభించనుంది.

Advertisement