Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండింగ్ సమయం మారింది..17 నిమిషాలు ఆలస్యంగా అడుగుపెట్టనున్న ల్యాండర్
జాబిల్లి దక్షిణ ధ్రువంపైజులై 14న చంద్రయాన్-3ను పంపించింది ఇస్రో. ఈనెల 23న సాయంత్రం ఇది చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కావాల్సి ఉంది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే సమయంలో ఎలాంటి పొరపాట్లు తావివ్వకుండా జాగ్రత్తలు చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 23న సాయంత్రం ఇస్రో సరికొత్త చరిత్రను సృష్టించనుంది. జాబిల్లిపై ల్యాండింగ్ సమయం మారింది.అయితే, ముందుగా ఇస్రో ఈనెల 23న సాయంత్రం 5.47గంటలకు సాప్ట్ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించింది. తాజాగా ఆ సమయాన్ని మార్పు చేసి17 నిమిషాలు ఆలస్యంగా అంటే.. 23వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టనుంది.