Page Loader
Hyper Sonic Missile: డీఆర్‌డీవో ఘనత.. హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం
డీఆర్‌డీవో ఘనత.. హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

Hyper Sonic Missile: డీఆర్‌డీవో ఘనత.. హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2024
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైన్యానికి మరో శక్తివంతమైన ఆయుధం చేరింది. శనివారం ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ హైపర్‌సోనిక్ క్షిపణి 1500 కిలోమీటర్లకు పైగా విభిన్న పేలోడ్స్‌ను తరలించే సామర్థ్యం కలిగి ఉంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ క్షిపణి భారత సైన్యానికి వ్యూహాత్మక ప్రాధాన్యతను కల్పించనుంది. ఇది హిస్టారికల్ మూమెంట్ అని, సైంటిస్టులను అభినందిస్తున్నానని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. భవిష్యత్ రక్షణ వ్యవస్థలో ఈ హైపర్‌సోనిక్ క్షిపణి కీలక పాత్ర పోషించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్వీట్ చేసిన రక్షణ మంత్రి