Page Loader
Apple :ఆపిల్ పరికరాల్లో CERT-In భద్రతా లోపాలు.. వినియోగదారులకు హెచ్చరిక
ఆపిల్ పరికరాల్లో CERT-In భద్రతా లోపాలు.. వినియోగదారులకు హెచ్చరిక

Apple :ఆపిల్ పరికరాల్లో CERT-In భద్రతా లోపాలు.. వినియోగదారులకు హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆపిల్ ఉత్పత్తులలో అనేక భద్రతా లోపాలను గుర్తించింది. వాటి ద్వారా దాడి చేసేవారు భద్రతా చర్యలను తొలగించి మీ సమగ్ర సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మంగళవారం CERT-In ఓ హెచ్చరికను జారీ చేసింది. పాస్‌వర్డ్‌ దొంగతనం, డేటాను మార్పు చేసే అవకాశం ఉందని పేర్కొంది. భద్రతా లోపాలు ముఖ్యంగా నల్ పాయింటర్ డెరీఫరెన్స్, టైప్ కన్ఫ్యూజన్, యూజ్-ఆఫ్టర్-ఫ్రీ పొరపాట్లు, అవుట్-ఆఫ్-బౌండ్స్ యాక్సెస్, తప్పు ఫైల్ హ్యాండ్లింగ్, పార్సింగ్ వంటి సమస్యల నుండి ఉత్పన్నమయ్యాయి.

Details

వినియోగదారులు అప్డేట్ చేసుకోవాలి

ముఖ్యంగా macOS, iOS, iPadOS పరికరాలను ఉపయోగిస్తున్నా వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. వినియోగదారులు తమ పరికరాలను తరచుగా అప్డేట్ చేయాలని లేదా ఆటోమేటిక్ అప్డేట్‌లు ప్రారంభించి ఈ భద్రతా లోపాలను పరిష్కరించుకోవాలని ఏజెన్సీ సూచించింది. iOS 18.3 వంటి ప్రధాన అప్డేట్ల కోసం Wi-Fiకి కనెక్ట్ అయినట్లు ఉండాలన్నారు.