
WhatsApp image scam: వాట్సాప్లో సరికొత్త స్కామ్.. ఫోటోలు డౌన్ లోడ్ చేసుకోగానే..
ఈ వార్తాకథనం ఏంటి
నవీన సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగిస్తూ సైబర్ నేరస్థులు రోజు రోజుకు కొత్త మోసాలను అభివృద్ధి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.
ఇప్పటికే లింకులు,సందేశాలు, ఫోన్ కాల్స్ వంటి సాధారణ మార్గాలతో మోసాలకు పాల్పడుతున్న వారు,తాజాగా మరింత అత్యాధునిక పద్ధతిని ఆశ్రయిస్తున్నారు.
స్కామర్లు వాట్సాప్ సహా ఇతర మెసేజింగ్ యాప్ల ద్వారా ఫోటోలను పంపి,వాటిలో స్టెగానోగ్రఫీ టెక్నాలజీ సాయంతో ప్రమాదకరమైన లింకులను యాడ్ చేస్తారు.
ఈ ఫోటోలను బాధితులు డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే వారి మొబైల్ ఫోన్లు క్రాష్ కావడానికి స్కామర్లు ఏర్పాట్లు చేసుంటారు.
వివరాలు
మోసం జరిగే విధానం ఇలా ఉంటుంది:
తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్‌లో వచ్చిన ఫోటోను డౌన్‌లోడ్ చేయగానే, ఆయన ఖాతా నుంచి దాదాపు రూ.2లక్షలు మాయమయ్యాయని పోలీసులు వెల్లడించారు.
దీంతో ఈ మోసాల గురించి టెలికాం శాఖ అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది.
వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు.
స్కామర్లు మొదటగా వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ల ద్వారా ఫోటోలను పంపడం ద్వారా వారి మాయాజాలాన్ని ప్రారంభిస్తారు.
కొన్ని సందర్భాల్లో,"ఫోటోలోని వ్యక్తిని గుర్తించగలరా?"అని అడుగుతూ ఫోన్ కాల్స్ కూడా చేస్తారు.
బాధితుడు ఆ ఫోటోను డౌన్‌లోడ్ చేసిన వెంటనే,ఫోన్ పనిచేయకుండా పోతుంది.దాంతోపాటు స్కామర్లకు ఆ ఫోన్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
వివరాలు
స్టెగానోగ్రఫీ అంటే ఏమిటి?
సైబర్ నిపుణుల ప్రకారం, ఇవాళ ఫేక్ లింకులు, ఓటీపీ స్కామ్‌లను మించిపోయి, స్టెగానోగ్రఫీ ద్వారా స్కామర్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నారని చెబుతున్నారు.
ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్స్కీ తెలిపిన వివరాల ప్రకారం, స్టెగానోగ్రఫీ అనేది సమాచారం దాచుకునే ఒక నూతన టెక్నిక్.
ఈ టెక్నాలజీ ద్వారా మెసేజ్, ఫోటో, వీడియో లేదా ఆడియో వంటి డిజిటల్ ఫైళ్లలో దాగిన సమాచారం లభించకుండా చేస్తారు.
ఇప్పుడు స్కామర్లు ఈ టెక్నిక్‌ను వినియోగించి, ప్రజల దగ్గర నుంచి డబ్బు దోచుకుంటున్నారు.
వివరాలు
ఈ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి?
వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఆటో డౌన్‌లోడ్‌ను ఆపేయండి.
తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోటోలు, వీడియోలు, ఆడియోలను ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయొద్దు.
అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కి స్పందించకుండా, వెంటనే బ్లాక్ చేయండి.
వాట్సాప్ అప్లికేషన్‌ను తరచూ అప్డేట్ చేస్తూ ఉండండి.
మీ వాట్సాప్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయకండి.
ఏదైనా అనుమానాస్పద మార్పులు ఫోన్‌లో గమనిస్తే, వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇవ్వండి.