Page Loader
పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ
స్మార్ట్ ఫోన్స్ కు పిల్లలు దూరంగా ఉండాలని చెప్పిన షియోమీ మాజీ సీఈఓ

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2023
08:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకూడదని ఇప్పటికే చాలామంది నిపుణులు, వైద్యులు చెప్పారు. చిన్న వయస్సులోనే పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం వల్ల వారికి మానసికంగా ఎనో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ సీఈఓనే తల్లిదండ్రులను పిల్లలకు ఫోన్స్ ఇవ్వకూడదని చెప్పడం గమనార్హం. స్మార్ట్ ఫోన్స్ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పాటించాలని షియోమీ ఇండియా కంపెనీ మాజీ సీఈఓ కుమార్ జైన్ వెల్లడించారు. స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్ లు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతిస్తుందో ఆయన వివరించారు. దీనిపై యూఎస్ కు చెందిన సపియన్ ల్యాబ్ అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన లింక్‌డిన్‌లో పోస్టు చేశాడు.

Details

స్మార్ట్ ఫోన్స్ కు పిల్లలు దూరంగా ఉండాలి

పదేళ్ల వయస్సులోనే పిల్లలు స్మార్ట్ ఫోన్స్ కు అలవాటు పడితే పెద్దయ్యాక మహిళలైతే 70శాతం, అదే పురుషులైతే 50శాతం దాకా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని యూఎస్ నివేదిక స్పష్టం చేసిందని కుమార్ జైన్ వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, ఇలాంటి విషయాన్ని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బాల్యం చాలా విలువైందని, ఆ సమయాన్ని వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాలపై కేంద్రీకరించాలని ఆయన సూచించారు. పిల్లలను మాత్రం స్మార్ట్‌ ఫోన్‌లకు సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.