Page Loader
SKY: ఆకాశంలో 'స్మైలీ ఫేస్'... ఎక్కడ నుంచి చూడాలంటే!
ఈ నెల 25న ఆకాశంలో అద్భుత దృశ్యం.. చూడడం మిస్ కావొద్దు!

SKY: ఆకాశంలో 'స్మైలీ ఫేస్'... ఎక్కడ నుంచి చూడాలంటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల 25న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రుడు, శని గ్రహాలు చంద్రుడికి దగ్గరగా వచ్చి, ఆకాశంలో స్మైలీ రూపాన్ని ఏర్పరచనున్నాయని నాసా వెల్లడించింది. ఈ అద్భుతాన్ని సూర్యోదయానికి ముందు మాత్రమే చూడవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ రెండు గ్రహాలు శుక్రుడు, శని చాలా ప్రకాశవంతంగా మెరుస్తాయి. దీంతో ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా నేరుగా వీక్షించవచ్చని నాసా తెలిపారు. అయితే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని వారు సూచించారు.

Details

చంద్రగిరి కోట సమీపం నుంచి చూసే అవకాశం

ఈ అద్భుత దృశ్యాన్ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామిర్ పేట, వరంగల్ పాకాల సరస్సు లేదా భద్రకాళి ఆలయం ప్రాంతంలో వీక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్, కొండపల్లి అటవీ ప్రాంతాలు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు సరైన స్థలాలు కాగా, తమిళనాడులో ఆర్ కె బీచ్, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, తిరుపతిలో కొండ వ్యూ పాయింట్, చంద్రగిరి కోట సమీపం కూడా వీక్షణ ప్రాంతాలుగా సూచించారు. ఈ విశేష దృశ్యాన్ని మిస్ కాకుండా, ఆకాశాన్ని గమనించి, అందులోని అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు.