Donald Trump: 'చంద్రుడు మాకే సొంతం'.. అమెరికా జెండాతో ఫొటో షేర్ చేసిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపై అమెరికాకు హక్కు ఉన్నట్లుగా 'చంద్రుడు మనదే' అంటూ ఓ ఫొటోను ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. చంద్రుడి చిత్రంపై 'చంద్రుడు మనదే' అని రాసి ఉండగా.. దాని పక్కన అమెరికా జెండాను కూడా ఉంచారు.
వివరాలు
అమెరికా అంతరిక్ష దళం కొత్త యూనిఫాం ఎలా ఉంది?
చంద్రుడి ఫొటోను పోస్టు చేయడానికి కొన్ని నిమిషాల ముందు ట్రంప్ అమెరికా అంతరిక్ష దళం (Space Force) కొత్త నల్లటి యూనిఫాంకు సంబంధించిన ఏఐ రూపొందించిన చిత్రాలను షేర్ చేశారు.
ఈ యూనిఫాంలో 'స్పేస్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, సిల్వర్ గ్రే, శాటిన్ బ్లాక్' రంగులను ఉపయోగించినట్లు ట్రంప్ వివరించారు.
భుజాలు, కాలర్‌పై చిహ్నాలు, చేతులకు ప్యాచ్‌లు, బెల్ట్‌తో ఈ యూనిఫాం కనిపించింది.
న్యూ మెక్సికోకు 'న్యూ అమెరికా' పేరు?
మరో పోస్టులో న్యూ మెక్సికో రాష్ట్రం పేరును 'న్యూ అమెరికా'గా మార్చాలన్న సూచనను ట్రంప్ చేశారు.
'న్యూ మెక్సికో' పేరును 'న్యూ అమెరికా'గా మార్చాలని చాలామంది సూచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
గవర్నర్ మిషెల్ లుజాన్ గ్రిషమ్ ఏమన్నారు?
అలా చేస్తే ఈ రాష్ట్రానికి మరింత గొప్పగా,అందంగా ఉండే పేరు వస్తుందని.. తనకు ఈ ఆలోచన చాలా నచ్చిందని ట్రంప్ రాసుకొచ్చారు.
ట్రంప్ ప్రతిపాదనకు వైట్‌హౌస్ కూడా మద్దతు తెలిపింది. వైట్‌హౌస్ పోస్టులో 'మెక్సికో' అనే పదాన్ని కొట్టివేసి, దాని స్థానంలో 'అమెరికా' అని రాసిన చిత్రాన్ని చూపించారు.
ట్రంప్ సూచనపై న్యూ మెక్సికో గవర్నర్ మిషెల్ లుజాన్ గ్రిషమ్ ఫాక్స్ న్యూస్‌లో స్పందించారు.
రాష్ట్రం పేరును మార్చడం అనేది చర్చించాల్సిన అంశమే కాదని ఆమె అన్నారు.
అమెరికా ఏర్పడకముందు నుంచే తమ రాష్ట్రానికి ఈ పేరు ఉందని పేర్కొన్నారు.
పెరుగుతున్న ఇంధన ధరలు వంటి సమస్యల నుంచి అమెరికన్ల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆమె విమర్శించారు.
వివరాలు
లేక్ ఒంటారియో పేరును 'లేక్ అమెరికా'గా మార్చిన ట్రంప్
న్యూ మెక్సికో పేరు మార్పు ప్రతిపాదనకు ముందు కూడా ట్రంప్ ఓ భౌగోళిక ప్రాంతం పేరును మార్చే నిర్ణయం తీసుకున్నారు.
కెనడాతో వాణిజ్య వివాదం కొనసాగుతున్న సమయంలో లేక్ ఒంటారియో పేరును 'లేక్ అమెరికా'గా మార్చే పత్రంపై ఆయన సంతకం చేశారు.
ఆగస్టు 27న ఓవల్ ఆఫీస్ నుంచి ఈ విషయాన్ని ప్రకటించారు. లేక్ ఒంటారియో.. కెనడా, అమెరికా సరిహద్దులో ఉన్న ఐదు గ్రేట్ లేక్స్‌లో ఒకటి.
దీనికి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్, అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంతో పేర్ల పరంగా సంబంధం ఉంది. ఈ సరస్సు వాయవ్య తీరంలో టొరంటో నగరం ఉంది.